క్రీడాకారులను పరిచయం చేసుకుంటోన్న డీఐజీ
డెంకాడ: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని బెటాలియన్స్ కాకినాడ రేంజ్ డీఐజీ కె.సూర్యచంద్ అన్నారు. చింతలవలస ఐదో ఏపీఎస్‌పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న ఏఆర్ కానిస్టేబుళ్లకు సోమవారం స్పోర్ట్స్‌మీట్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను డీఐజీ సూర్యచంద్, విజయనగరం పీటీసీ ప్రిన్సిపాల్ రాజశిఖామణి, 16వ బెటాలియన్ అదనపు కమాండెంట్ పి.మోహన్‌ప్రసాద్ పావురాలు, బెలూన్స్ ఎగురవేసి ప్రారంభించారు.
అనంతరం డీఐజీ సూర్యచంద్ మాట్లాడుతూ, క్రీడల వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటారన్నారు. ఇలాంటి స్పోర్ట్స్‌మీట్ వల్ల దాగిఉన్న క్రీడానైపుణ్యాలు బయటకు వస్తాయన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అడిషినల్ కమాండెంట్ ఎంబీవీ సత్యనారాయణ, బెటాలియన్ పోలీస్ అధికారులు జీవీ ప్రభాకరరావు, కె.తిరుమలరావు, జి.రవీంద్రకుమార్, వీవీ రమణ, ట్రైనింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment