alacrity
-
కాలు మీద కాలు
ఒక చెట్టు మీద ఒక కాకి రోజంతా అలాగే కూర్చొని ఉంది. కాలి నొప్పో, కంటి నొప్పో అయి కూర్చోవడం కాదు. ఉల్లాసంగా, విలాసంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది! కిందికి, పైకి, పక్కలకు ముక్కు కదపడం ఒక్కటే అది చేస్తున్న పని. ఓ కుందేలు ఉదయాన్నే ఆహారం వెతుక్కుంటూ చెట్టు కిందికి గెంతుకుంటూ వచ్చి, చెట్టు పైన కూర్చొని ఉన్న ఆ కాకిని చూసింది. మళ్లొకసారి అటు గెంతుతూ, ఇటు గెంతుతూ చెట్టు పైకి చూసింది. కాకి ఆ కొమ్మ మీద అలాగే కూర్చొని ఉంది. మధ్యాహ్నం అయినా అలాగే కూర్చొని ఉంది. సాయంత్రం కావస్తున్నా అలాగే కూర్చొని ఉంది. ‘ఆహా.. తిండి తిప్పల్లేకుండా, చీకూచింతా లేకుండా ఎంత హాయిగా బతుకుతోంది ఈ కాకి’ అనుకుంది. ఇక ఉండబట్టలేక, ‘‘కాకిగారూ.. నేను కూడా మీలాగే రోజంతా పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని విశ్రాంతిగా కూర్చొవచ్చా?’’ అని అడిగింది. ‘ఓ.. ఎందుక్కూర్చోకూడదూ? తప్పకుండా కూర్చోవచ్చు కుందేలు పిల్లా’’ అంది కాకి. కుందేలుకు సంతోషం వేసింది. ఆ చెట్టు కిందే తీరిగ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కొద్దిసేపటికే అటుగా వచ్చిన నక్క.. కుందేలును నోట కరుచుకుని వెళ్లింది. ఇందులో నీతి ఏమిటంటే.. పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని! -
క్రీడలతో మానసికోల్లాసం
డెంకాడ: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని బెటాలియన్స్ కాకినాడ రేంజ్ డీఐజీ కె.సూర్యచంద్ అన్నారు. చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న ఏఆర్ కానిస్టేబుళ్లకు సోమవారం స్పోర్ట్స్మీట్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను డీఐజీ సూర్యచంద్, విజయనగరం పీటీసీ ప్రిన్సిపాల్ రాజశిఖామణి, 16వ బెటాలియన్ అదనపు కమాండెంట్ పి.మోహన్ప్రసాద్ పావురాలు, బెలూన్స్ ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం డీఐజీ సూర్యచంద్ మాట్లాడుతూ, క్రీడల వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటారన్నారు. ఇలాంటి స్పోర్ట్స్మీట్ వల్ల దాగిఉన్న క్రీడానైపుణ్యాలు బయటకు వస్తాయన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అడిషినల్ కమాండెంట్ ఎంబీవీ సత్యనారాయణ, బెటాలియన్ పోలీస్ అధికారులు జీవీ ప్రభాకరరావు, కె.తిరుమలరావు, జి.రవీంద్రకుమార్, వీవీ రమణ, ట్రైనింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉల్లాసం
సూర్యాపేట : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని రెండో అదనపు జిల్లా జడ్జి షేక్ రజాక్ ఉజ్ – జమ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించిన క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. న్యాయవాదులు తమ వృత్తి పరంగా ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతారని, అలాంటి సమయంలో క్రీడలు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయన్నారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ మెజిస్ట్రేట్ డి.నర్సింహాచార్యులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూరి వెంకటేశ్వర్రావు, న్యాయవాదులు జె.శశిధర్, నలగుంట్ల అయోధ్య, తల్లమల్ల హస్సేన్, ఎం.వెంకట్రెడ్డి, కె.లింగయ్య, మీలా రమేష్, రామరాజు, సుంకరబోయిన రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రంధి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.