గౌరవ వందనం స్వీకరిస్తున్న జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఖైదీల్లో సత్ప్రవర్తన కోసం అధికారులు కృషిచేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా జైలును సందర్శించిన ఆయనకు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జైలు రిజిస్ట్రర్‌లను పరిశీలించిన ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ ఖైదీలతో మృదువుగా వ్యవహరించాలని సూచించారు. తాము చేసిన తప్పును తెలుసుకుని çపశ్చతాప పడేవిధంగా వారిలో మార్పు తీసుకురావాలన్నారు.
వారికి ప్రభుత్వం ప్రకటించే నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. ఖైదీల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికితీసే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జిల్లా జైలులో ఖైదీలకు అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల జీవన ప్రయోజనం కోసం మరో నూతన బారక్‌ను నిర్మించనున్నట్లు అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యాచకులు, ఆయుర్వేదిక విలేజీ పబ్లిక్ కోసం ఆనంద్ ఆశ్రమాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత తమ కాళ్లపై తాము నిలబడి జీవించే విధంగా తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్, జైలర్లు శ్రీనునాయక్, వెంకటేశ్వరస్వామి, డిప్యూటీ జైలర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment