ఉదాసీనతే అక్రమాలకు ఊతం!
పరిపాలన పరంగా కమిషనర్ అడపాదడపా ఇస్తున్న ఆదేశాల కంటే మెరుగైన ఆదేశాలిచ్చి క్షేత్రస్థాయి సిబ్బందిని తమ అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంటున్నామంటూ కమిషనర్‌కు కట్టుకథలు చెప్పి మభ్యపెట్టారు. దీంతో రెండేళ్లుగా కమిషనర్ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ప్రతిఏటా రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరగడంతో వచ్చిన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటున్న కమిషనర్ ఆ శాఖలో అక్రమాలను పసిగట్టడంలో పూర్తిగా విఫలమయ్యా రనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా, తన చేతికి మకిలి అంటకూడద న్నట్లుగా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపి చేతులు దులిపేసుకున్నారు. 10 రోజులుగా ప్రభు త్వ భూముల కుంభ కోణం, సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో అక్రమ రిజిస్ట్రేష న్లు, పలువురు సబ్ రిజి స్ట్రార్లు అరెస్ట్ వంటి సంఘ టనలు చోటు చేసుకుంటు న్నా కమిషనర్ ఒక్కరోజు కూడా కార్యాలయానికి రాకపోవడం గమనార్హం.
కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవని, ఆయన చెప్పిన దానికంటే మెరుగ్గా ఆడిట్ చేయించేందుకు తాము రెండు బృందాలను ఏర్పాటు చేశామని రంగారెడ్డి జిల్లాకు చెందిన డీఐజీ ఒకరు చెబుతున్నారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను మీరెలా రద్దు చేస్తారని ఆయనను ప్రశ్నిస్తే, కమిషనర్ ఆదేశాలు రద్దు చేయలేదని, ఆడిట్ ప్రక్రియను మెరుగుపరచామని బుకాయించారు. వాస్తవానికి కమిషనర్ ఏర్పాటు చేసిన ఆడిట్ టీమ్‌ను తనిఖీలకు పంపితే తమ బండారాలు బయటపడతాయనే కొందరు సబ్ రిజిస్ట్రార్లు, డీఐజీపై ఒత్తిడి తెచ్చి బలహీనమైన తనిఖీ బృందాలను వేయించుకున్నారని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది అంటున్నారు.