Registrars
-
ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు
ఎచ్చెర్ల క్యాంపస్: ‘రాష్ట్రంలో చాలామంది వీసీలు రాజీనామా చేశారు. ఇంకా మీరెందుకు చేయలేదు. తక్షణమే రాజీనామా చేయండి..’ అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏయూ) వైస్ చాన్స్‌లర్ ఆచార్య కేఆర్ రజిని, రిజిస్ట్రార్ పి.సుజాతలను తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్ ఎదుట గురువారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి ఆందోళన చేశారు.ముందుగా వీసీ వద్దకు వెళ్లి ‘ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు’ అని ప్రశ్నించారు. ‘అది మీకు అనవసరం..’ అని వీసీ సమాధానం చెప్పారు. దీంతో వీసీ చాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి వీసీ, రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ గంటసేపు గొడవ చేశారు. వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధికారులు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు.అనంతరం ‘మీరు రాజీనామా ఎలా చెయ్యరో చూస్తాం..’ అంటూ వీసీని హెచ్చరించి వెళ్లిపోయారు. మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయం నుంచి రాజీనామా చేయాలని వీసీకి పలుమార్లు హెచ్చరికలు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ ఏకంగా వీసీ రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీసీని అవమానించడం అన్యాయందళిత వీసీని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అవమానించడం, బెదిరించడం అన్యాయమని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత, రెక్టార్ అడ్డయ్య, ఓఎస్డీ కావ్య జ్యోత్స్న తదితరులు తీవ్రంగా ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఏర్పడిన 16 ఏళ్ల తర్వాత దళిత మహిళకు వీసీగా అవకాశం వస్తే అడ్డగోలుగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేసేవారిపై జాతీయ మహిళా కమిషన్‌కు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.వైస్ చాన్సలర్ రజిని జనవరి 18న బాధ్యతలు చేపట్టారని, మూడేళ్లు కొనసాగుతారని స్పష్టంచేశారు. బలవంతపు రాజీనామాలు అన్యాయమని ఖండించారు. వీసీ చాంబర్ ఎదుట ఆందోళన చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టపరంగా వర్సిటీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు యూనివర్సిటీలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల నిర్వహణకు సైతం ఆటంకం కలిగించారన్నారు. -
పలువురు వీసీల రాజీనామా
ఉన్నత విద్యకు పట్టుగొమ్మలుగా విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వదిలిపెట్టడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వర్సిటీలను తమ రాజకీయ విషక్రీడలకు బలిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్లను రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా వీసీలందరికీ ఫోన్లు చేయిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది వీసీలు రాజీనామాలు చేసి తప్పుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కూటమి నేతలు, అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సోమవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.సాక్షి, అమరావతి/కర్నూలు కల్చరల్/ఏఎఫ్‌యూ/తిరుపతి సిటీ/ఏఎన్‌యూ/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు. గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అయిన అబ్దుల్ నజీర్‌కు మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. బాబ్జీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ వైద్యుడు. గతంలో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)గా పనిచేసిన బాబ్జీ గతేడాది ఫిబ్రవరిలో వీసీగా నియమితులయ్యారు. 2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో తన పదవి నుంచి వైదొలిగారు.తప్పుకున్న రాయలసీమ వర్సిటీ వీసీ..కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో సుధీర్ ప్రేమ్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. హైదరాబాద్ జేఎన్టీయూ మెకానికల్ విభాగం ప్రొఫెసర్ అయిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఈ ఏడాది జనవరి 17న వీసీగా బా«ధ్యతలు స్వీకరించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ రాజీనామాతిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవి నుంచి వైదొలిగారు. ఆమె గతేడాది జూన్ 15న వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడితో రాజీనామా చేశారు.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ కూడా..కడపలో 2020లో ఏర్పాటైన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనను గతేడాది ఫిబ్రవరి 9న ఏఎఫ్‌యూ వీసీగా నియమించారు.కాగా ఇప్పటికే వైఎస్సార్ జిల్లాకు చెందిన యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి రాజకీయ నేపథ్యం, వివాదం లేని గిరిజన ఆచార్యుడైన బానోతు ఆంజనేయప్రసాద్‌ను సైతం రాజీనామా సమర్పించాలని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో వీసీ పదవి నుంచి వైదొలిగారు. 2026 ఫిబ్రవరి 8 వరకు పదవీకాలం ఉన్నా తప్పుకున్నారు.వైదొలిగిన జేఎన్టీయూకే వీసీజేఎన్టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు తన పదవికి రాజీనామా చేశారు. 2021 అక్టోబర్ 29న వీసీగా నియమితులైన ఆయన మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.ఏఎన్‌యూ వీసీ, ఉన్నతాధికారులు..గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు కో–ఆరి్డనేటర్లు, డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. -
సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లపైనా ‘నిఘా’
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిన వారి జాబితాలో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు కూడా ఉన్నారని ‘ది వైర్’ న్యూస్ పోర్టల్ బుధవారం వెల్లడించింది. సుప్రీంకోర్టు జడ్జి వాడిన పాత ఫోన్ నంబరు కూడా దీంట్లో ఉందని తెలిపింది. రిజిస్ట్రార్లు ఎన్కే గాంధీ, టీఐ రాజ్‌పుత్‌లు సుప్రీంకోర్టులోని ‘రిట్’ విభాగంలో పనిచేసినపుడు.. 2019లో వీరి ఫోన్లపై నిఘా పెట్టారు. ప్రతి ఏడాది దాదాపు వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవుతాయని, వీటిలో ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవి, రాజకీయంగా సున్నితమైన అంశాలకు సంబంధించినవి కూడా ఉంటాయని వైర్ పేర్కొంది. అందువల్లే రిజిస్ట్రార్లపై కన్నేసి ఉంచారని వివరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా వాడిన పాత ఫోన్ నంబరు కూడా నిఘా జాబితాలో ఉంది. సదరు ఫోన్ నంబరు 2014లోనే వాడటం ఆపేశానని అరుణ్ మిశ్రా తెలిపారు. అయితే 2018 దాకా ఇది ఆయన పేరుపైనే ఉందని వైర్ తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా పాత ఫోన్ నంబరును 2019లో నిఘా జాబితాలో చేర్చారు. ఆయన 2020లో రిటైరయ్యారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సన్నిహితుడు, ఆయన దగ్గర పనిచేసే జూనియర్ ఎం.తంగదురై ఫోన్‌పైనా నిఘా పెట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారుచేసిన పెగసస్ స్పైవేర్‌తో విపక్ష నాయకులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులపై (మొత్తం 300 మందిపై) కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని తమ పరిశోధనలో తేలిందని అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం వెల్లడించినప్పటి నుంచి భారత్‌లో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్రమంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, 40 మంది పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే తాము పెగసస్ స్పైవేర్‌ను అమ్ముతామని ఎన్ఎస్ఓ ప్రకటించింది. చట్ట విరుద్ధంగా ఎవరిపైనా నిఘా పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా... అంటే దానర్థం ఈ నిఘా సాఫ్ట్వేర్ భారత ప్రభుత్వం వద్ద ఉన్నట్లు, దాన్ని వాడుతున్నట్లు అంగీకరించడమేనని విపక్షాలు అంటున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జూలై 19 నుంచి పెగసస్ అంశంపై పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. -
ఉదాసీనతే అక్రమాలకు ఊతం!
- కట్టుకథలతో కమిషనర్ కళ్లకు గంతలు - సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫీల్‌గుడ్ కలరింగ్ - ఆయన ఆదేశాల కంటే తామే మెరుగ్గా ఆడిట్ చేయించామన్న డీఐజీలు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో రోజురోజుకూ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమాయలో పలువురు సబ్రిజిస్ట్రార్ల లీలలు బట్టబయలైన విషయం తెలిసిందే. తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారి ఉదాసీనతే అనేక అక్రమాలకు ఊతమిచ్చిందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్(సీఐజీ)కళ్లకు కొంతమంది అధికారులు గంతలు కట్టారు. కమిషనర్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీ వ్యవహారాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయంటూ కొందరు డీఐజీలు, మరికొందరు జిల్లా రిజిస్ట్రార్లు రెండేళ్లుగా కప్పిపుచ్చారు. పరిపాలన పరంగా కమిషనర్ అడపాదడపా ఇస్తున్న ఆదేశాల కంటే మెరుగైన ఆదేశాలిచ్చి క్షేత్రస్థాయి సిబ్బందిని తమ అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంటున్నామంటూ కమిషనర్‌కు కట్టుకథలు చెప్పి మభ్యపెట్టారు. దీంతో రెండేళ్లుగా కమిషనర్ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ప్రతిఏటా రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరగడంతో వచ్చిన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటున్న కమిషనర్ ఆ శాఖలో అక్రమాలను పసిగట్టడంలో పూర్తిగా విఫలమయ్యా రనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా, తన చేతికి మకిలి అంటకూడద న్నట్లుగా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపి చేతులు దులిపేసుకున్నారు. 10 రోజులుగా ప్రభు త్వ భూముల కుంభ కోణం, సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో అక్రమ రిజిస్ట్రేష న్లు, పలువురు సబ్ రిజి స్ట్రార్లు అరెస్ట్ వంటి సంఘ టనలు చోటు చేసుకుంటు న్నా కమిషనర్ ఒక్కరోజు కూడా కార్యాలయానికి రాకపోవడం గమనార్హం. మెరుగు పర్చారా.. బలహీన పర్చారా! హైదరాబాద్‌లోని కూకట్పల్లి, బాలా నగర్, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో అక్రమాలను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) ఆరు నెలల కిందటే హుకూం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు జిల్లా(ఆడిట్)రిజిస్ట్రార్లతో ప్రత్యేక ఆడిట్ టీమ్‌ను ఏర్పాటు చేస్తూ గత ఫిబ్రవరిలో కమిషనర్ ఆదేశాలిచ్చారు. జూన్ 2లోగా నివేదిక సమర్పించాలని ఆ టీమ్‌కు దిశానిర్దేశం కూడా చేశారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవని, ఆయన చెప్పిన దానికంటే మెరుగ్గా ఆడిట్ చేయించేందుకు తాము రెండు బృందాలను ఏర్పాటు చేశామని రంగారెడ్డి జిల్లాకు చెందిన డీఐజీ ఒకరు చెబుతున్నారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను మీరెలా రద్దు చేస్తారని ఆయనను ప్రశ్నిస్తే, కమిషనర్ ఆదేశాలు రద్దు చేయలేదని, ఆడిట్ ప్రక్రియను మెరుగుపరచామని బుకాయించారు. వాస్తవానికి కమిషనర్ ఏర్పాటు చేసిన ఆడిట్ టీమ్‌ను తనిఖీలకు పంపితే తమ బండారాలు బయటపడతాయనే కొందరు సబ్ రిజిస్ట్రార్లు, డీఐజీపై ఒత్తిడి తెచ్చి బలహీనమైన తనిఖీ బృందాలను వేయించుకున్నారని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది అంటున్నారు. -
అక్కడ పోస్టింగ్..వద్దు బాబోయ్
ధర్మవరంలో తమ్ముళ్ల దెబ్బకు సబ్ రిజిస్ట్రార్ల హడల్ మామూలు ఇవ్వాలంటూ వేధింపులు.. సెలవుపై వెళ్తున్న అధికారులు అధికారం అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. ఏకంగా అధికారుల వద్దే రౌడీ మామూళ్లు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాదూ కూడదంటే..సెలవులో వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారు. అంతకూ వినకపోతే సదరు ఆఫీసర్‌ను బదిలీ చేయిస్తున్నారు. దాదాపుగా అనంతపురం జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్నా, ధర్మవరంలో మాత్రం మితిమీరింది. ధర్మవరం : అనంతపురం జిల్లా ధర్మవరంలో పోస్టింగ్ అంటేనే సబ్రిజిస్ట్రార్లు హడలిపోతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక ఒకరు.. వారు అడిగినంత మామూళ్లు ఇచ్చుకోలేక మరొకరు..ఇలా ఎవరికి వారు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నలుగురు సబ్ రిజిస్ట్రార్లు మారిపోయారు. తాజాగా టీడీపీ నాయకులు ఏరికోరి కర్నూలు నుంచి తెచ్చుకున్న వై.బజారీ కూడా వీరు చెప్పే పనులు చేయలేక సెలవుపై వెళ్లిపోయారు. దీంతో మూడు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇన్చార్జ్ పాలనలో నడుస్తోంది. గతంలో కూడా శ్రీనివాసనాయక్ అనే సబ్‌రిజిస్ట్రార్ అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, వేధింపులతో దాదాపు ఆరు నెలల పాటు అవస్థ పడ్డారు. ప్రతినెలా తమకు మామూళ్లు ఇవ్వాలని, లేకపోతే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేస్తామని తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేశారు. ఏ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారన్న జాబితా కూడా తమకు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. చోటా నాయకులు కూడా ‘అన్న పిలుస్తున్నాడు.. అన్న చెప్పాడు’ అంటూ సదరు సబ్ రిజిస్ట్రార్‌ను తరచూ పార్టీ కార్యాలయం వద్దకు పిలవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలను రిజిష్టర్ చేయాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. తనమాట వినలేదన్న కోపంతో ఓ నేత సదరు సబ్ రిజిస్ట్రార్‌పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు. అయినప్పటికీ శ్రీనివాస్‌నాయక్ వారికి లొంగకపోవడంతో ఓ ప్రజాప్రతినిధి వద్దకు పిలిపించి సెలవుపై వెళ్లాలని ఒత్తిడి చేశారు. అయినా ఆయన తన పని తాను చేసుకుపోవడంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయించారు. ఆయన వెళ్లిన తర్వాత తాము చెప్పినట్లు వింటాడని కర్నూలు జిల్లా నుంచి వై.బజారీని నెలరోజుల క్రితం ఇక్కడికి తీసుకు వచ్చారు. ఆయన కూడా ‘తమ్ముళ్లు’ అడిగినంత ఇచ్చుకోలేకపోవడంతో సెలవుపై పంపినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి సెలవు పెట్టారు. ప్రతి నెలా ఇంత మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అంటేనే ఆ శాఖ అధికారులు హడలెత్తుతున్నారు.