నేరాల సంఖ్య తగ్గుముఖం
నేరాల సంఖ్య తగ్గుముఖం
Published Tue, Dec 13 2016 12:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
పెదవేగి రూరల్ : ఏలూరు రేంజ్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని డీఐజీ పి.వి.ఎస్.రామకృష్ణ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం పెదవేగి పోలీస్ స్టేష¯ŒSను ఆయన తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, స్టేష¯ŒS పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు.అనంతరం నేరాల నమోదు, రికార్డులను పరిశీలించిన డీఐజీ పెదవేగి ఎస్సై రామకోటేశ్వరరావకు సూచనలిచ్చారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలను నియంత్రించాల్సి ఉందని తెలిపారు. దీనికోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో సంప్రదాయాలకు గౌరవం ఇస్తూనే వాటి ముసుగులో చేసే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోలీసుల పని తీరుపై ర్యాంకుల విధానం ప్రవేశపెట్టి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులతోపాటు రివార్డులను ఇస్తున్నట్టు వివరించారు. జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో రెండు రివార్డులు అందుకున్నారని చెప్పారు. నేరాలను అదుపు చేయడంతోపాటు నేరాల సంఖ్యను తగ్గించడమే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. తొలుత డీఐజీకి ఎస్పీ భాస్కర భూషణ్ పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన పోలీస్ క్వార్టర్స్, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ భాస్కర భూషణ్, ఏలూరు డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదవేగి ఎస్సై రామకోటేశ్వరరావు, ఎస్సై చిరంజీవి సిబ్బంది ఉన్నారు.
Advertisement