
అనంతపురం సెంట్రల్: అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా కాంతిరాణా టాటాను నియమించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఇన్నాళ్లూ ఇక్కడ డీఐజీగా పనిచేసిన జె. ప్రభాకర్‌రావును సీఐడీ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిఅనిల్‌చంద్రపునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే 12న అనంతపురం రేంజ్ డీఐజీగా ప్రభాకర్‌రావు బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాల నాలుగునెలల పాటు ఆయన పనిచేశారు. జిల్లాపై డీఐజీ ప్రభాకర్‌రావు ముద్ర ఉండేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అవినీతి, అరోపణలు ఎదుర్కొన్న వారిపై చర్యల్లో తనదైన మార్క్ చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment