కదిరి టౌన్ : అనంతపురం జిల్లా కదిరి సీఐ కార్యాలయాన్ని డీఐజీ సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రబ్బరు బుల్లెట్లు కొన్ని తక్కువగా ఉన్నట్టు తేలింది. అలాగే 2013-14వ సంవత్సరానికి సంబంధించి ఎస్పీ కార్యాలయం నుంచి పంపించిన పిటిషన్లు కనిపించలేదు. కొన్ని గ్రనేడ్లు 2002లోనే గడువు తీరిపోయినా వాటిని అలానే ఉంచడాన్ని డీఐజీ గుర్తించారు. వీటిపై విచారణకు కదిరి డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులును ఆదేశించారు.