
ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న డీఐజీ
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భక్తజనబృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈవో రామరాజు, సూపరింటెండెంట్లు లక్ష్మినాగరాజు, సుబ్రమణ్యం ఇతర అధికారులు, పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు
డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్
ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ జి. శ్రీనివాస్ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ, ఓఎస్‌డీ నయిం అస్మి, టీటీడీ డీఈ రాఘవయ్య ఉన్నారు. అనంతరం కోదండ రామస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్ ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ సీసీ కెమెరాల కనుసన్నల్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment