‘మరిన్ని విజయూలు సాధించాలి’ | 47th sports of Visakhapatnam, Andhra Pradesh State Level Police | Sakshi
Sakshi News home page

‘మరిన్ని విజయూలు సాధించాలి’

Published Wed, Mar 19 2014 3:56 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

‘మరిన్ని విజయూలు సాధించాలి’ - Sakshi

‘మరిన్ని విజయూలు సాధించాలి’

 ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్  : ఉద్యోగులు పోలీసు క్రీడోత్సవాలలో పాల్గొని ప్రతిభ చూపాలని ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్ అన్నారు. ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన 47వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడోత్సవాలలో ఏలూరు రేంజ్ పోలీస్‌లు అన్ని పోటీల్లో ప్రతిభ చూపారు.
 
  స్థానిక పోలీసు పేరేడ్ గ్రాండ్‌లో మంగళవారం వీరికి  అభినందన సభ ఏర్పాటుచేశారు.  ముఖ్యఅతిధిగా విక్రమ్‌సింగ్‌మాన్, జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ, అదనపు ఎస్పీ ఎన్. చంద్రశేఖర్  పాల్గొన్నారు. డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్ మాట్లాడుతూ ఇటువంటి విజయాలు మరిన్ని ఏలూరు రేంజ్ టీం సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
 
 టీం మేనేజర్‌గా వ్యవహరించిన ఏలూరు ఏఆర్ డీఎస్పీ కుంభకోటేశ్వరరావును, పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను డీఐజీ అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement