
'ఇప్పుడు సాధ్యం కాదనటం అన్యాయం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కేంద్రం వెనుకడుగు వేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. చంద్రబాబు నిర్ణయాలు, ప్రాధాన్యతలు రాష్ట్రాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. కార్పొరేట్ శక్తుల కోసం చంద్రబాబు పని చేస్తున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష నేతలను చంద్రబాబు ఢిల్లీకి తీసుకు వెళ్లాలని సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న వెంకయ్య నాయుడు..ఇప్పుడు సాధ్యం కాదనటం అన్యాయమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సహకరించాలని సి.రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు. వెంకయ్య నాయుడు కూడా ఆ మేరకు బీజేపీని, కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన కోరారు.