ఓటుకు నోటు కేసులో బాబే దోషి
కడప వైఎస్సార్ సర్కిల్ :
ఓటుకునోటు కేసులో చంద్రబాబే అసలు దోషి అని శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య పేర్కొన్నారు.శుక్రవారం ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రజల పరువు తీశారని, చంద్రబాబు అవినీతికి పాల్పడకుంటే కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య బీజేపీ ఢిల్లీ పెద్దలు రాజీ కుదిర్చి చంద్రబాబును కేసు నుంచి తప్పించి హైదరాబాదు విడిచి విజయవాడకు వెళ్లే విధంగా ఒప్పంద చే శారని ఆరోపించారు. దీంతో పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఉండాల్సిన ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించారన్నారు. రాజ్‌భవన్‌ను రాజీల భవన్‌గా మార్చి పంచాయితీలు చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల పేరుతో ఉన్న నీటిని వదిలేసి రైతులు పంటలు వేసుకోకుండా చేశారన్నారు.
పుష్కరాల పేరుతో18వందల కోట్లు దుబారా ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిపై ఏసీబీ విచారణ జరుగుతుంటే నిలిపివేయడం ఇద్దరి సీఎంల మధ్య సయోధ్య కుదరడమేనన్నారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రజలకు రోజుకో మాట చెబుతు కాలం గడుపుతున్నారు తప్ప ఏం చేయలేదన్నారు ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్యాకేజీలపేరుతో ఏపి ప్రజలను అన్యాయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. సుజనాచౌదరి ప్రత్యేకహోదాకు చట్టంలో అడ్డంకులు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఈసమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తార్ పాల్గొన్నారు