కడప జిల్లాపై చంద్రబాబు వివక్ష: రామచంద్రయ్య
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. కడప జిల్లాలో రాజకీయంగా బలంగా లేదనే కారణంతో ఈ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు.
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదన్న నెపంతో వారిపై కక్ష కట్టడం సబబు కాదని ఆయన అన్నారు. సీఎం పథకాలు మంత్రులకే అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులకే అర్ధంకాని పథకాలను ప్రజల వద్దకు ఎలా చేరుతాయని రామచంద్రయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు.