
'చంద్రబాబు దేవుడి భూములనూ వదలట్లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవుడి భూములను కూడా వదలడం లేదని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. సోమవారమిక్కడ ఆయన మాట్లాడుతూ...సదావర్తి సత్రం భూముల్లో నూ.5 వేల కోట్ల స్కాం జరిగిందన్నారు.
ఈ భూముల వేలం వ్యవహారంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రధాన లబ్ధిదారుడు కాగా, భూముల విక్రయంలో టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హస్తముందన్నారు. ప్రభుత్వం వెంటనే సదావర్తి భూముల విక్రయాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు జోక్యం చేసుకోవాలని రామచంద్రయ్య కోరారు.