'బాబు తన చేతగానితనాన్ని ఒప్పుకోవాలి'
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించలేకపోవడం చంద్రబాబు నాయుడు చేతగానితనాన్ని ఒప్పుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. విధానపత్రంతో చంద్రబాబు దివాళాకోరుతనం బయటపడిందని ఆయన అన్నారు. శుక్రవారం సి.రామచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఒక సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందని, పదవులన్నీ ఓ సామాజిక వర్గానికే ఇస్తున్నారని, అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
కేంద్ర మంత్రులే ఫ్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సి.రామచంద్రయ్య అన్నారు. మోదీ పార్లమెంట్కు రాకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. వాజ్పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవని, మోదీ తీరు చూస్తుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజు అనిపిస్తుందన్నారు.