'బాబును ఎడ‍్యుకేట్ చేయడానికి సిద‍్ధం'
కడప: ప్రత‍్యేక హోదా విషయంపై పూర్తిగా వివరించి ముఖ‍్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎడ‍్యుకేట్ చేయడానికి తాము సిద‍్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ‍్య పేర‍్కొన్నారు. గురువారం ఆయన ఇక‍్కడ ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రత‍్యేక హోదా వల‍్ల ఒనగూడే ప్రయోజనాల విషయమే ముఖ‍్యమంత్రి ప్రజలను మోసం చేస‍్తున్నారని, హోదా వల‍్ల కలిగే లాభాల గురించి తాము ముఖ‍్యమంత్రికి వివరించి ఆయనను ఎడ‍్యుకేట్ చేయడానికి సిద‍్ధమని రామచంద్రయ‍్య చెప్పారు. ముఖ‍్యమంత్రి అందుకు సిద‍్ధం కావాలని సూచించారు. వ‍్యక్తిత‍్వం లేనివారు ఇతరుల వ‍్యక్తిత‍్వం గురించి మాట‍్లాడడం సరికాదన్నారు.