
'సీఎంకు పౌరుషం ఉంటే మంత్రులతో రాజీనామా.. '
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంగా తేల్చిందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా కేంద్రంలో తన మంత్రులను కొనసాగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిజంగా సీఎంకు పౌరుషం ఉంటే మంత్రులను వెంటనే రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సహాయం కోసం ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని చంద్రబాబుపై సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.