
సి.రామచంద్రయ్య
హైదరాబాద్: ఏపిలో ప్రభుత్వం చేపట్టే జన్మభూమి కార్యక్రమాలలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందిరా భవన్లో ఏపిసిసి కార్యవర్గం సమావేశం జరిగింది. అనంతరం మాజీ మంత్రి సి. రామచంద్రయ్య మాట్లాడుతూ రుణాల మాఫీ, చేనేత కార్మికుల సమస్యలు, పెన్షన్లు, స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని సమావేశపరచాలని డిమాండ్ చేశారు.
అక్టోబరు మొదటి వారంలో పిసిసి కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. జిల్లాలవారీగా అధ్యక్షులను నియమిస్తారని చెప్పారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో పోటీచేస్తామని చెప్పారు. భద్రత గురించి కాంగ్రెస్ నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా తగ్గించడంపై డిజిపికి ఫిర్యాదు చేస్తామని రామచంద్రయ్య చెప్పారు.
**