
టీడీపీ పునాదులు బాబు పెకిలించేస్తున్నారు
మాజీ మంత్రి సి. రామచంద్రయ్య
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు పునాదులతో సహా పెకలించేస్తున్నారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. దీనిపై ఆపార్టీ శ్రేణులు అప్రమత్తం కావాలని సూచించారు.
టీడీపీ శ్రేణుల్ని చంపారని, ఖూనీకోరులని విమర్శించిన వారినే ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడంపై చంద్రబాబు నుంచి వివరణ కోరాలన్నారు. సోమవారం ఇందిరాభవన్‌లో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. బాబు విజన్ ధనవంతులకే మేలు చేస్తుందని, ఈ విషయాన్ని గమనించే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని అన్నారు.