ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ విజయసారథి
గుంటూరు మెడికల్ : ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ గడ్డం విజయసారథి ఏకగీవ్రంగా ఎంపికయ్యారు. గురువారం విజయవాడలో మెడికల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ రాజారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సభ్యుడుగా కొనసాగుతున్న డాక్టర్ విజయసారథిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. గుంటూరు వైద్య కళాశాల జనరల్ సర్జరీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ విజయసారథి పనిచేస్తున్నారు. వైద్య విద్యను బలోపేతంచేసేందుకు నూతనంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నిరంతర వైద్య విద్య కార్యక్రమాలను మరింత మెరుగుపరిచేందుకు సంస్కరణలు తీసుకొస్తామని వెల్లడించారు. తనను వైస్ చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజారావుకు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ రవిరాజుకు కతజ్ఞతలు తెలిపారు.