హైదరాబాద్ : శాసనమండలిలో గురువారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణపై ప్రశోత్తరాల్లో ఎమ్మెల్సీ నాగేశ్వర్, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య సంవాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని...కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు.
తాము దర్పాన్ని ప్రదర్శించటానికి సభలకు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ కంటే శాసనమండలిలోనే సరైన చర్చ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. మీడియాలో మండలికి సరైన కవరేజ్ రావటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా తమ ప్రాధాన్యతలను ప్రజల ముందు పెట్టామని కేటీఆర్ తెలిపారు.