nageswar
-
సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ
నాంపల్లి (హైదరాబాద్): దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లుగా జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచిక దారుణంగా పడిపోయిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సామాజిక సదస్సులో పాల్గొన్న నాగేశ్వర్, సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు–ప్రభావాలు అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో 23 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని పేర్కొన్నారు. దేశ సంపదలో 20 శాతం కేవలం ఒక శాతం జనాభా చేతిలో ఉందన్నారు. బ్రిటన్ దేశాన్ని అధిగమించి ఐదవ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ భారతదేశం తలసరి ఆదాయం, బ్రిటన్ ప్రజల తలసరి ఆదాయం కంటే 20 రెట్లు తక్కువగా ఉందన్నారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పన్నును ఒకేసారి పది శాతం తగ్గించిందని చెప్పారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.లక్షా 80 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయిందని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ నివేదికలే చెప్తున్నాయని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఆలోచించడం, మతాచారాలను పాటించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా వ్యక్తుల ఇష్టాఇష్టాలు, వ్యక్తిగత సిద్ధాంతాల ప్రాతిపదికన పరిపాలన సాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణంతో పాటు ఎగుమతి, దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయన్నారు. కరోనా తర్వాతి కాలంలో కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యల్లోనూ నిజాయితీ లోపించడంతో ప్రజల కు ఏ రకమైన ఉపశమనం లభించలేదన్నారు. సద స్సులో టీఎన్జీఓ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
‘అగ్రిగోల్డ్’ పరిష్కారంలో జాప్యం సరికాదు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితుల కేసు కోర్టులో ఉందని సాకు చూపుతూ వారి సమస్యను పరిష్కరించడంలో జాప్యం చేయడం సరికాదని, సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తానంటే ఏ కోర్టూ అభ్యంతరం తెలపదని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నా రూ.1,150 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు మంజూరు చేసిందని, తెలంగాణలోని బాధితులకు రూ.500 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని, దీనిలో ముందుగా రూ.300 కోట్లు మాత్రమే కేటాయించాలని కోరుతున్నారని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌బాబు, అడ్వొకేట్ శ్రవణ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జస్టిస్ లక్ష్మణరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహ హాజరయ్యారు. జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులను ప్రభుత్వం అప్పుడే అరెస్టు చేసి ఉంటే బాగుండేదని, కానీ ఉదాసీనంగా వ్యవహరించడంతో వారు తమ ఆస్తులను బినామీల పేరిట బదలాయించారని, ప్రస్తుతం తమ వద్ద ఏమీ లేదని అంటున్నారని, ఇందులో ప్రభుత్వ తప్పు కూడా ఉందన్నారు. బాధితుల్లో 95% మంది పేదవారేనని, ప్రభుత్వం ఎన్నింటికో ఎన్నో ఖర్చు చేస్తున్నదని, రూ.500 కోట్లు బాధితులకు ఇవ్వాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో మోసపోయిన బాధితులకు అక్కడి ప్రభుత్వం న్యాయం చేసిందని, ఆ సంస్థ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇవ్వాలన్నారు. ధనిక రాష్ట్రంలో రూ.500 కోట్లు ఇవ్వలేరా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, బాధితులకు రూ.500 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో ప్రాజెక్టులు, నీళ్లు, పంపకాలపై సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కూడా దృష్టి సారించాలన్నారు. నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నదని ప్రశ్నించారు. ఇటీవల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, వారి సీటుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్లలో ఎన్ని పోరాటాలు చేసినా స్పందించలేదని, జగన్ మేనిఫెస్టోలో చేర్చగానే అధికారంలోకి వచ్చారన్నారు. -
ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా నిరుద్యోగులను నిరాశలోనే ఉంచిందని ఉద్యోగాల సాధన సమితి మండిపడింది. ఖాళీగా ఉన్న లక్షా ఏడు వేల ఉద్యోగాలను ఏడాది కాలంలో భర్తీ చేస్తానన్న ప్రభుత్వం కేవలం 20 వేల ఉద్యోగాలు కూడా `భర్తీ చేయలేదని పేర్కొంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాల సాధన సమితి చైర్మన్ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ నేతృత్వంలో బుధవారం సదస్సు జరిగింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరైన ఈ సదస్సులో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. సదస్సులో కొన్ని తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖాళీలన్నింటినీ విడతల వారీగా కాకుండా ఒకే సారి భర్తీ చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని భర్తీ చేసుకోవడానికి పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం తేవాలన్నారు. పబ్లిక్ ట్రైనింగ్ యాక్ట్ ద్వారా శిక్షణ ఇవ్వాలని, మూతపడిన పరిశ్రమల్లో ఎందరు ఉద్యోగాలు కోల్పోయారు, ఇతర రంగంలో కొత్త ఉద్యోగాలు పొందినవారెందరో తెలపాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐటీ సెక్టార్లో ప్రతి ఏటా శిక్షణ ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలని, టీఆర్టీ కోసం వాస్తవ ఖాళీల సంఖ్యను ప్రకటించాలని సమితి కోరింది. -
నోట్ల రద్దు వెనుక వాస్తవాలపై విశ్లేషణ అవసరం
భీమవరం టౌన్: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యపరమైన హీనతతో బాధపడుతోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. నగదు రహిత ఆర్థికవ్యవస్థ చెడ్డదని, ఉపయోగం లేనిదని తాను చెప్పనని అయితే దానికి ముందుగా ఆర్థికవ్యవస్థ స్వరూపం మార్చాలని స్పష్టం చేశారు. భీమవరం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ‘పెద్దనోట్ల రద్దు.. ప్రజ లపై ప్రభావం’ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన నాగేశ్వర్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు దాని వెనుక ఉన్న వాస్తవాలపై ఆర్థిక విశ్లేషణ అవసరమన్నారు. పెద్దనోట్ల రద్దు సాహసం ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ చేయలేదు.. ప్రధాని మోదీ మాత్రమే చేశారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని నాగేశ్వర్ చెప్పారు. ఐరోపా దేశాల ఆర్థికకూటమి పెద్దనోట్లను గతంలో రద్దు చేసిందన్నారు. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు ఇదే మొదటిసారి కాదన్నారు. సామాన్యులు కూడా రూ.500 నోట్లు సంపాదిస్తున్నారని ఈ నోటు విలాసవస్తువో, సంపన్నులకు మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ నగదురహిత ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని చెప్పి 40 రోజులు తిరగకుండానే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాటమార్చారన్నారు. నల్లధనం రూ.500, రూ.1,000 నోట్లు అయితే బొగ్గు, స్పెక్టమ్ర్, కామన్వెల్త్, పశుగ్రాసం, బోఫోర్స్, కేజీ బేసిన్, హర్షద్ మెహతా తదితర కుంభకోణాల్లో ఎన్ని లక్షల కోట్లు ఆ కుంభకోణాలకు పాల్పడిన వారి ఇళ్లల్లో దొరికాయని నాగేశ్వరరావు ప్రశ్నించారు. నగదు రహిత విధాన కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్నారని హ్యాక్ జరిగితే నెలకొనే ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారో ఆయన చెప్పాలన్నారు. దేశంలో ఒక కోటి యాభై లక్షలు చిన్నదుకాణాలు ఉన్నాయని, స్వైపింగ్ మెషిన్లు 14 లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. 90 శాతం రోడ్డు పక్క వ్యాపారాలు చేసేవారే ఉన్నారన్నారు. ఒక్కోటి 50 లక్షల దుకాణాలకు స్వైపింగ్ మెషిన్లు ఎప్పుడిస్తారు? ఈలోపు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సదస్సుకు యూటీఎఫ్ అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షత వహించారు. వివిధ సంఘాల నాయకులు గాతల జేమ్స్, చింతకాయల బాబూరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
భీమవరం టౌ¯ŒS : విచిత్ర జాతిని విద్యావ్యవస్థ సృష్టిస్తుంటే విద్యార్థి సంఘాలు చూçస్తూ ఊరుకోవంటూ హా¯Œ్స ఇండియా చీఫ్ ఎ డిటర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 21వ మహాసభల్లో భాగంగా శుక్రవారం ముఖ్య అతిథిగా నాగేశ్వర్ మాట్లాడారు. విద్యాసంస్థలు సమాజం గురించి ఆలోచించే మెదళ్లను తయారు చేయలేనప్పుడు విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విద్యారంగంలో వెనుకబడ్డాయన్నారు. బలమైన ప్రజా ఉద్యమా లు, సామాజికాభివృద్ధి ద్వారానే విద్యారంగం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చే ప్రతి చర్యనూ సమర్థిస్తామని, ఇందుకు విరుద్ధమైన ప్రతి చర్యనూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చా రు. పాలకులు విద్యాహక్కు చట్టాన్ని కూ డా నీరుగార్చుతున్నారని ఆందోళన వ్యక్త ం చేశారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు విద్యావ్యాప్తికి దోహదపడదన్నారు. దాడులను ప్రశ్నించకూడదా..! సింగపూర్, చైనా, జపాన్, అమెరికాలను చూసి నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నాగేశ్వర్ అన్నారు. యూనివర్సిటీలు ఎలా ఉన్నాయనడానికి వేముల రోహిత్, కన్హయ్య సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. దాడులను విద్యార్థులు ప్రశ్నించకూడదనే భావనలో పాలకులు ఉన్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు జనం బారులు తీరి ఉంటుండగా ఈ విషయంపై ఉస్మానియా వర్సిటీలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. విద్యావిధానంలో, విద్యా సమాజంలో మార్పునకు విద్యార్థి సంఘాలు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేధావులను తయారు చేసే కేంద్రంగా విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆకాంక్షించారు. పేదలకు ఉన్నత విద్య దూరం ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు మ తోన్మాదులకు నిలయాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ పోరాటాలు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌సింగ్, జాతీయ మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఉపాధ్యక్షుడు పి.రవికుమార్, మంతెన సీతారాం, కె.హరికిశోర్, బి.సాంబశివ, పి.తులసి, ఎల్.చిన్నారి, కె.మహేష్, రాజు, పి.కిరణ్, ఎంవీ రమ ణ, ఎ.అశోక్, కె.ఆంజనేయులు, కె.క్రాం తి తదితరులు పాల్గొన్నారు. -
మండలిలో నాగేశ్వర్.. జగదీష్ రెడ్డి వాగ్వాదం
హైదరాబాద్ : శాసనమండలిలో గురువారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణపై ప్రశోత్తరాల్లో ఎమ్మెల్సీ నాగేశ్వర్, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య సంవాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని...కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. తాము దర్పాన్ని ప్రదర్శించటానికి సభలకు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ కంటే శాసనమండలిలోనే సరైన చర్చ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. మీడియాలో మండలికి సరైన కవరేజ్ రావటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా తమ ప్రాధాన్యతలను ప్రజల ముందు పెట్టామని కేటీఆర్ తెలిపారు. -
అయ్యయ్యో..
పాపం.. డిపాజిట్లూ దక్కలేదు! హనుమంతు.. ధరావత్తు గల్లంతు అదే వరుసలో ‘సర్వే’.. ఇంకా జేపీ, జయసుధ, కూన, ప్రొ.నాగేశ్వర్‌లకు కూడా.. ముద్దం, శ్రీధర్లకూ భంగపాటే.. సాక్షి, సిటీబ్యూరో: గెలుపు ఖాయమనుకున్నారు. ఏయే ప్రాంతాల్లో, ఏయే వర్గాల నుంచి ఎన్నెన్ని ఓట్లు పడతాయో అంచనాలు వేశారు. మెజారిటీ ఎంతన్నది లెక్కలు కట్టారు. కానీ, ఓటర్ల ‘లెక్క’ వేరే ఉంది. గుక్కతిప్పుకోలేని విధంగా తీర్పునిచ్చారు. బిత్తరపోవడం అభ్యర్థుల వంతైంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు డిపాజిట్ కోల్పోయారు. గెలుపు ధీమాతో బరిలో దిగిన పలువురికి గెలుపు సంగతలా ఉంచితే, కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అలాంటి వారిలో ఏకంగా సీఎం స్థానం కోసం, కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ఆశపడిన వారూ ఉన్నారు. రెండుసార్లు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, గత మంత్రివర్గంలో మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలుగా చేసిన వారూ.. ఈ జాబితాలో ఉన్నారు. సీఎం అవుతారన్నారు! పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్ల కన్నా తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోయినట్టు. అలా డిపాజిట్లు కోల్పోయిన గ్రేటర్ ప్రముఖుల్లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా వీహెచ్ రేసులో ఉంటారని ప్రచారం జరిగింది. పైగా ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై పోటీకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రాజ్యసభ పదవీకాలం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశతో వీహెచ్ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 1,46,682 కాగా డిపాజిట్ దక్కాలంటే 24,447 ఓట్లు పొందాలి. వీహెచ్‌కు 16,975 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన డిపాజిట్ గల్లంతైంది. అయ్యో.. పాపం! శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోలైన ఓట్లు 2,82,823. వీటిలో కనీసం 47,137 ఓట్లు వస్తే డిపాజిట్ దక్కినట్టు. తాజా మాజీ ఎమ్మెల్యే అయిన బిక్షపతి యాదవ్ (కాంగ్రెస్)కు 43,196 ఓట్లు మాత్రమే వచ్చాయి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరోమారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ ప్రముఖురాలు జయసుధకు సైతం డిపాజిట్ దక్కలేదు. అక్కడ 1,36,549 ఓట్లు పోలవగా, జయసుధకు 14,090 ఓట్లు లభించాయి. ఇవి ఆరో వంతు కూడా లేకపోవడంతో ఆమె డిపాజిట్ కోల్పోయారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ (కాంగ్రెస్)కు 40,199 ఓట్లు మాత్రమే లభించాయి. ఇక్కడ డిపాజిట్ దక్కాలంటే 48,711 ఓట్లు రావాల్సి ఉంది జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థానానికి ఎదగాలని ఆశపడ్డప్పటికీ, డిపాజిట్లు కూడా దక్కించుకోని వారిలో ముద్దం నరసింహయాదవ్, నందికంటి శ్రీధర్ ఉన్నారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ నర్సింహయాదవ్ కూకట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 23,321 ఓట్లు మాత్రమే రావడంతో ఆయనకు డిపాజిట్ దక్కలేదు. ఆ నియోజకవర్గంలో పోలైన 2,36,367 ఓట్లలో డిపాజిట్ రావాలంటే 39,394 ఓట్లు రావాలి జీహెచ్ఎంసీ కో-ఆప్షన్ సభ్యుడైన నందికంటి శ్రీధర్ మల్కాజిగిరి కా్రంగెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ 2,31,103 ఓట్లు పోలవగా, ఆయనకు 37,201 ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ డిపాజిట్ దక్కాలంటే 38,517 ఓట్లు రావాల్సి ఉంది. లోక్‌సభ బరిలో డిపాజిట్ దక్కని ప్రముఖులు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో హాట్ స్పాట్‌గా మారింది. పలువురు హేమాహేమీలు ఇక్కడి నుంచి బరిలో దిగారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 16,05,550 ఓట్లు పోలవగా, డిపాజిట్ దక్కాలంటే అభ్యర్థి 2,67,591 ఓట్లు పొందాలి. ఈ మొత్తం ఓట్లు రాక డిపాజిట్లు కోల్పోయిన ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్నారాాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి భీమ్సేన్ (టీఆర్ఎస్)కు సైతం డిపాజిట్ గల్లంతైంది. అక్కడ మొత్తం 9,86,590 ఓట్లు పోలవగా, ఆయనకు 1,43, 847 ఓట్లు మాత్రమే లభించాయి. -
రేవంత్ మల్కాజ్ 'గురి'
మల్కాజ్‌గిరిపై గురి పెట్టే రాజకీయ నేతల లిస్ట్ పెరిగిపోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైన, ప్రతిష్ఠాత్మకమైన మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంపై వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కన్నేశారు. అక్కడ నుంచి పోటి చేస్తే గెలుపు నల్లేరు మీద నడేకనని నాయకులంతా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఇటు తెలంగాణావాదులు , ఇటు సీమాంధ్ర నాయకులు భారీగా పోటీపడుతున్నారు. సెటిలర్లతో పాటు విద్యాధికులు ఎక్కువగా ఉండటంతో.. అన్నిపార్టీల నేతలు మల్కాజ్గిరి స్థానంపై కర్చీప్ వేసుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశారు కూడా. మరోవైపు ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హఠావో...దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీతో తెరమీదకు వచ్చిన సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా మల్కాజ్గిరి నుంచే పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కోడంగల్ టీడీపీ రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరులు ఎలా పోటీకి దిగుతారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. స్థానికుడిగా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగే అర్హత తనకే ఉందంటూ ఘంటా బజాయించి మరీ చెబుతున్నారు. కాగా రేవంత్‌తో పాటు ఈసారి ఎంపీ బరిలోకి దిగుదామనుకున్న మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కూడా ఈ పోటీలో ఉన్నారు. అయితే గ ఇదే వ్యూహంతో గత రెండేళ్లుగా నియోజకవర్గానికి చెందిన నేతలతో రేవంత్ రెడ్డి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. యువనేత కావడం, తెలంగాణావాదాన్ని గట్టిగా వినిపించిన రేవంత్‌కి సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా సర్వే సత్యనారాయణ, ఇంకా చాలామంది ఈ స్థానం మీద కన్నేశారు. ఇక్కడ నుంచే ఓ దశలో చంద్రబాబు పోటీ చేస్తారని.... అలాగే విజయశాంతి, కేసీఆర్, జయసుధ కూడా మల్కాజ్గిరి నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. అయితే మల్కాజ్ గిరి స్థానం నుంచి విజయం సులువుగా దక్కుతుందా? మల్కాజ్ గిరి అంత హాట్ కేక్ గా ఎందుకు మారింది.. అనేదే రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో విద్యావంతులు, యువత, సెటిలర్స్, మహిళలు ఎక్కువగా ఉండడంతో వారిని ఆకట్టుకుంటే తమను ఆదరిస్తారని నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణా ఉద్యమ ప్రభావం ఉన్నా సరే.. సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఆశావహుల చూపులన్నీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇంతమంది ఆశపడుతున్న మల్కాజ్గిరి, చివరకు ఎవరికి పట్టం కడుతుందో చూడాలి మరి!! -
అందరి కళ్లూ మల్కాజ్ గిరి పైనే!
భౌగోళికంగా హైదరాబాద్‌లోను, పాలనాపరంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోను ఉన్న మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం ఇప్పుడు అందరికీ హాట్ సీటులా కనిపిస్తోంది. దాన్ని ఎగరేసుకుపోవాలని ప్రతి ఒక్కళ్లూ భావిస్తున్నారు. అక్కడి ఓటుబ్యాంకును దృష్టిలో పెట్టుకుని, ఎలాగైనా అక్కడే పోటీ చేయాలని తహతహలాడిపోతున్నారు. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ నాగేశ్వర్ చూస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే సన్నిహితులు, మిత్రులతో సంప్రదింపుల పర్వం పూర్తి చేసిన నాగేశ్వర్.. ఏదో ఒక పార్టీ తరపున కాకుండా, తన పంథా, వైఖరి రీత్యా అన్ని వర్గాల మద్దతు పొందేందుకు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన పోటీ చేస్తే మద్దతిస్తామని సీపీఎం బహిరంగంగానే పేర్కొంటుండగా, తమ పార్టీ తరపున పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కోరుతోంది. ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున తానంటే, తాను పోటీ చేస్తానని రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక దశలో ఆసక్తి కనబరిచారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా సర్వే సత్యనారాయణ, ఇంకా చాలామంది ఈ స్థానం మీద కన్నేశారు. ఇంతమంది ఆశపడుతున్న మల్కాజ్గిరి, చివరకు ఎవరికి పట్టం కడుతుందో చూడాలి మరి!! -
సీఎం కిరణ్‌కు సమైక్యత పై చిత్తశుధిలేదు-నాగేశ్వర్