హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికమంత్రి బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే అదే సమయంలో శాసనమండలిలో డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ను ప్రవేశపెడతారు. రేపు సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం కానుంది. ఈనెలాఖరు వరకూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసన్నం కావడంతో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ముందుగానే వివిధ శాఖాధిపతులతో విస్తృతంగా చర్చించి, ఈ బడ్జెట్కు రూపకల్పన చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎదురుదాడికి సమాయత్నం అవుతున్నాయి.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Published Tue, Nov 4 2014 10:20 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement
Advertisement