హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఎన్నికకు సంబంధించి 5వ తేదీన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండగా, 6 వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నేతి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.