సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధించి సీఎం అయిన కేసీఆర్‌కు మండలి సభ్యులు అభినందనలు తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం సభ్యులు మాట్లాడారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగంపై విపక్షాల సందేహాలకు సమాధానం ఇచ్చారు. మండలిలో ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ సహా పలువురు సభ్యులు గవర్నర్ ప్రసంగంలో తప్పొప్పులను విమర్శిస్తూనే కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. తాను ఒక్కడినే తెలంగాణ సాధించలేదనీ ఇందులో తెలంగాణ యావత్తూ పాలుపంచుకుందని కేసీఆర్ అన్నారు. కాగా, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా డి.శ్రీనివాస్, ఉప నాయకుడిగా షబ్బీర్ అలీని గుర్తిస్తూ మండలి చైర్మన్ విద్యాసాగర్‌రావు సభలో ప్రకటన చేశారు.