సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు నెలల పాలన.. ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి నేతల మోసాలకు ప్రజలు బలైపోయారని అన్నారు. చంద్రబాబు ప్రజలను ఫుల్స్‌ను చేశారని ఘాటు విమర్శలు చేశారు
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారు. 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. చంద్రబాబు గజినీల పాలన చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఫుల్స్ చేశారు. చంద్రబాబు ఏడు నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉంది. ఎలుగుబంటి తోలు ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలుపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉంది.
ఎన్నికలకు ముందు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు. దేశంలో వరస్ట్ పాలన చేసే ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలపై టీడీపీతో నేను బహిరంగ చర్చకు సిద్ధం. గతంలో మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసివేస్తే.. నేడు ఆలోచనల్లో నుంచే మేనిఫెస్టోను చంద్రబాబు తీసివేశారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు మోసానికి బలైపోయారు. కూటమికి ఓటు ఓటేస్తే లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment