సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాలు వేరు అనేది స్పష్టమైందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బడ్జెట్ సందర్భంగా గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌తో బీహార్ ప్రయోజనం పొందిందని తెలిపారు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది అంటూ ఆవేదన వ్యకం చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏదో కేటాయిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. మహాకవి గురజాడ పేరును తలుచుకోవడం మనందరికీ గర్వకారణం. గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశ, నిస్పృహ కనిపించాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనమేమీ రాష్ట్రానికి కనిపించలేదు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది.
కేంద్రంలో 12 మంది నితీష్ కుమార్ ఎంపీలు, 16 మంది టీడీపీ ఎంపీల సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. బడ్జెట్‌తో బీహార్ రాష్ట్రం ప్రయోజనం పొందింది. ఏపీకి ఎటువంటి ప్రయోజనం పొందలేదు. రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాల వేరు అనేది స్పష్టమైంది. 45.72 మీటర్లు నుంచి 41.15 మీటర్ల ఎత్తుకు కుదిస్తూ నిధులు కేటాయించడం బాధాకరం. పోలవరం ఎత్తు తగ్గించడం వలన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది.
మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము. పోలవరం ఎత్తు తగ్గించడం తీవ్ర అభ్యంతరకరం. ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజీని చంద్రబాబు తీసుకున్నారు. నేడు అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరిగేలా చర్యలు ఉండకూడదు. కూటమి పాలనలో కంటే వైఎస్ జగన్ పాలనలో జీడీపీ, వృద్ధిరేటు అభివృద్ధి ఎక్కువగా జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?. ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసు అన్నారు. ఎన్నికల తర్వాత డబ్బు సంపాదించడం ఎలాగో నా చెవిలో చెప్పాలని చంద్రబాబు చెప్పడం ధర్మమా.?
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు ఎందుకు చెప్పలేక పోయారు. ప్లాంట్‌పై బడ్జెట్‌లో ఎందుకు మాట్లాడలేదు. రైతుభరోసా, అమ్మఒడి ఇవ్వలేదు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. చంద్రబాబు ఇచ్చే హామీలు సాధ్యం కాదని ముందే వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. వైఎస్ జగన్ పాలనలో ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం అనేక సార్లు సంప్రదింపులు జరిపాము. వైఎస్ జగన్ వలనే ప్రైవేటీకరణ అగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి స్వయంగా చెప్పారు అని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment