సాక్షి, విశాఖపట్నం: శ్రీవారి లడ్డూ విషయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ డిమాండ్ చేస్తున్నారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఈ వివాదంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.
విశాఖలో ఎమ్మెల్యే వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చేసిన తప్పు బయట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. తిరుమలలో టీటీడీ నిబంధనలు ఉంటాయా, టీడీపీ నిబంధనలు ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేకుండా హోం మంత్రి అనితా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను క్రిస్టియన్ అని చెప్పిన అనితా నేడు, హిందువుని అని చెపుతున్నారని తెలిపారు. అనితా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు.
చదవండి: బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జల
గతంలో సీఎంగా, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తిరుపతికి వెళ్ళారని, అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని ప్రశ్నించారు. గతంలో ప్రధాని, హోం మంత్రితో, జగన్ తిరుపతి వెళ్లారని.. అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చి, ఇవ్వలేదని అబద్ధం చెపుతున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారని, ఆమెకు సొంత వ్యక్తిత్వం లేదని విమర్శించారు. షర్మిల కడుపు మంటతో మాట్లాడుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment