పశ్చిమ గోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పై టీడీపీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధికార జులుం ప్రదర్శించారు. రబీ పంట నీటి కోసం గురువారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబుతో పాటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
అయితే ఏపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే రైతులకు సాగునీటి కష్టాలొచ్చాయని శేషుబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలపై నిమ్మల రామానాయుడు ఆగ్రహంతో ఊగిపోయి రైతుల తరఫున ధర్నా చేస్తున్న మేకా శేషుబాబును పోలీసుల సాయంతో దౌర్జన్యంగా గెంటివేయించారు.
ఈ సంఘటనపై స్పందిస్తూ.. రైతులకు సాగునీరు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని మేకా శేషుబాబు పేర్కొన్నారు. అధికారంతో నిమ్మల రామానాయుడు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ఆయన అహంకారానికి ప్రజలే బుద్ధి చేబుతారని శేషుబాబు అన్నారు.
పాలకొల్లులో ఉద్రిక్తత
Published Thu, Dec 24 2015 10:18 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement