meka sheshu babu
-
బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
-
‘పార్టీల భవితవ్యాన్ని తేల్చేది బీసీలే’
సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : ఎన్నికల్లో పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించేది బీసీలేనని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏలూరులో ఫిబ్రవరి 17న నిర్వహించనున్న బీసీ గర్జన సభ ఏర్పాట్ల విషయాలను ఆయన మంగళవారం మీడియాతో పంచుకున్నారు. ఈ సభను విజయవంతం చేస్తామన్నారు. బీసీల్లోని 134 కులాల ఇబ్బందులను ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారని, వాటిని అధిగమించేటట్లు బీసీ డిక్లరేషన్ ఇస్తారని తెలిపారు. బీసీ డిక్లరేషన్‌తో వైఎస్ జగన్ చరిత్ర సృష్టిబోతున్నారని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డినేనన్నారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర దేశ చరిత్రలోనే ఏ నాయకుడు చేయలేదన్నారు. బీసీలకు మేలు వైఎస్ జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బీసీల పార్టీని చెప్పుకుంటూ మోసం చేయడం తప్ప, చేసిందేమి లేదని మండిపడ్డారు. బీసీలకు న్యాయం జరగాలంటే జగనే సీఎం కావాలని ఆకాంక్షించారు. -
పాలకొల్లులో ఉద్రిక్తత
-
పాలకొల్లులో ఉద్రిక్తత
పశ్చిమ గోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పై టీడీపీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధికార జులుం ప్రదర్శించారు. రబీ పంట నీటి కోసం గురువారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబుతో పాటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అయితే ఏపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే రైతులకు సాగునీటి కష్టాలొచ్చాయని శేషుబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలపై నిమ్మల రామానాయుడు ఆగ్రహంతో ఊగిపోయి రైతుల తరఫున ధర్నా చేస్తున్న మేకా శేషుబాబును పోలీసుల సాయంతో దౌర్జన్యంగా గెంటివేయించారు. ఈ సంఘటనపై స్పందిస్తూ.. రైతులకు సాగునీరు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని మేకా శేషుబాబు పేర్కొన్నారు. అధికారంతో నిమ్మల రామానాయుడు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ఆయన అహంకారానికి ప్రజలే బుద్ధి చేబుతారని శేషుబాబు అన్నారు.