‘ఎమ్మెల్యే రామానాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’ | Yalamanchili Constituency Incharge Kavuru Srinivas Slams On TDP MLA Ramanaidu | Sakshi
Sakshi News home page

నియోజకవర్గంలో పర్యటించిన ఇంచార్జ్‌ కవురు శ్రీనివాస్‌

Published Mon, Oct 28 2019 3:12 PM | Last Updated on Mon, Oct 28 2019 4:10 PM

Yalamanchili Constituency Incharge Kavuru Srinivas Slams On TDP MLA Ramanaidu - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో యలమంచిలి మండలంలోని ఇసుక ర్యాంపులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కవురు శ్రీనివాస్‌, మండల కన్వీనర్‌ పోత్తూరి బుచ్చిరాజు, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, చెల్లెం ఆనంద ప్రకేష్‌లు సోమవారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇసుక ర్యాంపులపై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుకపై పర్సంటేజీలు తీసుకుని 100ల కోట్లు దోచుకున్న విషయం మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మరిచిపోలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇసుక కొరత ఏర్పడిన విషయం వాస్తవమని అన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఇసుక నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్‌లైన్‌లో ఇసుక పాలసీని ప్రారంభించామని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement