
సాక్షి, పాలకొల్లు: జల దీక్షలంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్ర కార్యదరి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ మండిపడ్డారు. దీక్ష పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అసత్యాలు ప్రచారం చేసి పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ముంపు బాధితులకు అండగా ఉంటాం:
వరద ముంపు బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ అన్నారు. బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితులకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో వండిన ఆహారాన్ని ఎమ్మెల్యే నిమ్మల అనుచరులు తినేయడంతో.. మళ్లి వండించి బాధితులకు పెట్టామన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment