సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామకాలకు సంబంధించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సై నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్‌కు మంగళవారం క్లియరెన్స్ ఇచ్చింది.
అభ్యర్థుల ఎత్తు. కొలతల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలను అడ్డుకున్న స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు విచారణ చేపట్టింది. ఆపై న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించింది. అయితే.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది.
అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. రిక్రూట్ మెంట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఏం జరిగింది?
►నెలన్నర కింద న్యాయస్థానం ముందు ఎస్సై అభ్యర్థుల పిటిషన్
►ఇప్పటికే పలు మార్లు పిటిషన్‌లు వేసిన అభ్యర్థులు
►అభ్యర్థుల తరపున జడ శ్రవణ్ పిటిషన్
►ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు కోర్టులో కేసులు
►తొలుత ఫలితాలు విడుదల చేయకుండా హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే
►ఎస్సై రిక్రూట్‌మెంట్‌లో ఎత్తు విషయంలో అభ్యంతరాలు
►ఇప్పటికే రెండు సార్లు ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు
►ఎత్తు విషయంలో విఫలమయ్యారని తేల్చిన ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు
►హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు
►రెండో సారి కొలిచిన తర్వాత మళ్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందుకు పిటిషన్
►రెండో సారి మాన్యువల్‌తో కాకుండా.. స్కానర్లతో ఎత్తు కొలిచిన బోర్డు
►రెండో పరీక్షలోనూ అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు
►అయినా హైకోర్టులో మళ్లీ పిటిషన్ వేసిన జడ శ్రవణ్
►అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్‌లు వేశారని ఆరోపణలు
►రిక్రూట్‌మెంట్ బోర్డు పై ఆరోపణలు తప్పని తేలితే రూ.లక్ష జరిమానా కడతారా? ప్రశ్నించిన హైకోర్టు
►అంగీకారం తెలుపుతూ మెమో దాఖలు చేయాలని ఆదేశం
►హైకోర్టు సమక్షంలో ఒక్కొక్క అభ్యర్థి ఎత్తు కొలుస్తామన్న జడ్జిలు
►ఎత్తు విషయంలో అర్హత సాధించలేకపోతే.. లక్ష కడతామని రాసివ్వాలని షరతు
►అభ్యర్థులు వెనక్కి తగ్గడంతో ఫలితాలు విడుదల చేసుకోవచ్చన్న హైకోర్టు
ఇదీ చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది
Comments
Please login to add a commentAdd a comment