
విశాఖలో పేదల భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విశాఖలో ఒక లక్షా 80 వేల మందికి కోర్టు తీర్పు ఊరట నిచ్చింది.
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పేదల భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విశాఖలో ఒక లక్షా 80 వేల మందికి కోర్టు తీర్పు ఊరట నిచ్చింది. ఇల్లు లేని వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. దీనిపై కొందరు పిటిషన్ దాఖలు చేయడంతో ఇళ్ల స్థలాలు పంపిణీ నిలిచింది. ఇప్పుడు ఆ పిటిషన్ కొట్టి వేయడంతో లబ్ధిదారులు సంతోష వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఏపీ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన