ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ గుండెపోటుతో కన్నుమూశారు. సబ్-ఇన్‌స్పెక్టర్ సురేంద్ర నాథ్ త్రివేది(59) పోలీసు పోస్ట్ నయాఘాట్ వద్ద కొందరితో మాట్లాడుతూ గుండెపోటుకు గురయ్యారు.
వెంటనే అతనిని శ్రీరామ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సురేంద్ర నాథ్ త్రివేది హర్దోయ్ జిల్లా నివాసి. సురేంద్ర నాథ్ 2023, డిసెంబరు 16న అయోధ్య పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1983లో పోలీసు శాఖలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment