పరుగు పందెంలో ఆగిన కానిస్టేబుల్ గుండె
కర్నూలు (హాస్పిటల్): కర్నూలులో నిర్వహిస్తున్న ఎస్‌ఐ ఎంపిక పరీక్షల్లో శనివారం అపశృతి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పూజారి తండాకు చెందిన రమావత్ బాలాజీనాయక్ (30) అదే పట్టణంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఎస్‌ఐగా పదోన్నతి పొందాలని కర్నూలులో జరిగే ఎస్‌ఐ సెలెక్షన్స్‌కు సిద్ధమయ్యాడు.
శనివారం ఉదయం స్థానిక ఏపీఎస్‌పీ బెటాలియన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనగా, గమ్యం చేరుకునేలోపు అస్వస్థతకు గురయ్యాడు. కాగా అక్కడి అధికారులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కర్నూలు ఎస్‌ఐ ఎంపిక పరీక్షల్లో అపశృతి
Published Sun, Jan 8 2017 2:07 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement