వట్‌పల్లి(అందోల్): వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ పోస్టు నెల రోజులుగా ఖాళీగా ఉంటోంది. గతనెల 8వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ లక్ష్మణ్‌తో పాటు సిబ్బంది ఓ పార్టీ నాయకుడి బర్త్‌డే వేడుకలు నిర్వహించడంతో ఎస్‌ఐపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఆ తర్వాత అతని స్థానంలో మరో ఎస్‌ఐని నియమించకుండా ఏఎస్‌ఐ విఠల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. జోగిపేట సర్కిల్‌లో వట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ఎక్కువ. ఈ మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనికి తోడు వట్‌పల్లి మీదుగా కర్నాటక, మహారాష్ట్ర, బీదర్ ప్రాంతాలకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు.
గుట్కా, తంబాకు వంటివి అక్రమంగా రవాణా అవుతుంటాయి. వరంగల్, బీదర్, కర్నాటక ప్రాంతాల నుంచి గుట్కా, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో నెలలో ఒకటి రెండు కేసులు నమోదు కావడం పరిపాటి. మండలంలో పేకాట పెద్ద ఎత్తున సాగుతోంది. పూర్తిస్థాయి ఎస్‌ఐ లేకపోవడంతో కొందరూ సిబ్బంది సైతం విధి నిర్వహణలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. త్వరితగతిన ఎస్‌ఐని నియమించి శాంతి భద్రతలకు కృషి చేయాలని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment