సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి (జేపీఎస్) బైరి సోని(31) ఆత్మహత్య జిల్లాలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జేపీఎస్‌లు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 11 రోజుల నిరవధిక సమ్మేలో పాల్గొన్న తదనంతరం విధులకు హాజరైన తొలిరోజే పంచాయతీ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది సోనీ. అయితే ఉద్యోగ భద్రత లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందని జేపీఎస్‌లు, కుటుంబసభ్యులు అంటుంటే, భర్త వేధింపుల వల్లే చనిపోయిందని పోలీసుల చెప్పడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
దీంతో ఆమె మృతి పలు అనుమానాలకి తావివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆఖరికి పోస్ట్‌మార్టం నిర్వహించి సోనీ మృతదేహాన్ని ఇంటికి తరలిస్తున్న సయమంలోనూ ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. బాధితురాలి అంబులెన్స్‌ని అడ్డుకుని జేపీఎస్‌లు నిరసనలు చేశారు. దీంతో పోలీసులు కూడా వెన్నక్కి తగ్గారు. ఈ ఉద్రికత్తల నడుమే సోనీ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఈ అంతిమయాత్రలో జేపీఎస్‌లు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. సోనీ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జేపీఎస్‌లు గట్టిగా డిమాండ్ చేశారు. మృతురాలు పంచాయతీ కార్యదర్శి సోని అంతమ యాత్రలో మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి , కాంగ్రస్, బీజేపి నాయకులు తదితరలు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, కుటుంబ కలహాలతో సోని ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న సోని కూతురికి ఉచిత విద్యను అందించడం తోపాటు కుటుంబ సభ్యులు సూచించిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని అధికారలు హామీ ఇచ్చారు.
(చదవండి: సోని ఆత్మహత్య కలకలం.. ఊరుకో తాత.. నీ కుమార్తెను ఇక నేనే..)
Comments
Please login to add a commentAdd a comment