సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
పర్వతగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో శుక్రవారం తన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య, రైతు రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి మాటతప్పారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి సంతకం చేస్తానని, గ్రామాల్లో బెల్ట్ షాపులు నిషేధిస్తామని అన్నారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలు లేక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment