కాకినాడలోని జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ-కే) ఇంజనీరింగ్ విద్యార్థులకు వింత పరీక్ష ఎదురైంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు.. ప్రశ్నపత్రంలో కనిపించిన అధికారుల 'చంద్రబాబు భజన'ను చూసి బిత్తరపోయారు. ఎక్కడా లేని లోకేష్ బ్యాంక్ ప్రశ్నాపత్రంలో కనిపించడంతో ముక్కున వేలేసుకున్నారు.