question paper
-
Function of the Heart: విశాల హృదయం
క్వశ్చన్ పేపర్లో ‘గుండె బొమ్మ గీసి వివిధ భాగాలను వివరించుము’ అనే ప్రశ్నను చూసిన స్టూడెంట్ మహాశయుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. గుండె బొమ్మను కలర్ఫుల్గా గీయడం వరకు ఓకే. అయితే ఆ గుండెలో వివిధ భాగాలలో తాను ప్రేమించిన అమ్మాయిల పేర్లు రాశాడు. ప్రియా, నమిత, హరిత, రూప, పూజలాంటి పేర్లు రాశాడు. మరో అడుగు ముందుకు వేసి ‘ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్’ అనే హెడ్‌లైన్‌తో వారిని తాను ఎందుకు ప్రేమిస్తున్నానో రాశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజనులను నవ్వులలో ముంచెత్తుతుంది. -
3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ«ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. -
గురుకుల పరీక్షలకు 86.54 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9వేల ఉద్యోగాల భర్తీకి ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు పక్కాగా ఏర్పాటు చేశారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈసారి కొత్తగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. గురుకుల బోర్డు ద్వారా నిర్వహిస్తున్న మొట్టమొదటి సీబీఆర్టీ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు తొలిరోజు సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రోజున మూడు సెషన్లలో సగటున 86.54 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజున మూడు సెషన్లలో ఆర్ట్ టీచర్ పేపర్–1, క్రాఫ్ట్ టీచర్ పేపర్–1, మ్యూజిక్ టీచర్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఈ మూడు పరీక్షలకు మొత్తంగా 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా... కేవలం 9,450 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఇచ్చారని ఆందోళన మంగళవారం ప్రారంభమైన పోటీ పరీక్షల్లో మొదటిరోజు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రం పూర్తిగా ఆంగ్లంలో మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్లో మాత్రం తెలుగు, ఆంగ్లంలో ప్రశ్నపత్రం ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఇలా చేయడమేమిటని పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పైగా సరిపడా కంప్యూటర్లు లేకుండానే ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్లైన్ విధానంలో పరీక్షలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపుపై గందరగోళం.. ఆప్షన్ ఇచ్చిన జిల్లా, చుట్టుపక్కల జిల్లాలు కాకుండా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళా, గర్భిణి, బాలింత అభ్యర్థులు పరీక్షలను రాయలేని పరిస్థితి నెలకొంది. ఇతర అభ్యర్థులు సైతం వేల రూపాయలు చార్జీలకోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులు డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి పేపర్–1, పేపర్–2, పేపర్–3 రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సైతం ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి రాయాల్సిన విధంగా కేంద్రాలు ఇచ్చారు. -
NEET 2023: కెమిస్ట్రీ కఠినం.. ఫిజిక్స్ గందరగోళం.. ఇదేమీ ప్రశ్నాపత్రం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి నీట్ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు విశ్లేషించారు. బాగా చదివినవారికి మధ్యస్థంగా, మామూలుగా వారికి కఠినంగా ఉంటుందని చెబుతున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ‘నీట్’పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో ఈసారి దరఖాస్తు చేసుకున్న వారిలో 95 శాతం మందికి పైగా పరీక్షకు హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. గత నాలుగేళ్లతో పోలిస్తే.. ఈసారి నీట్ కాస్త కఠినంగానే ఉందని పరీక్ష అనంతరం విద్యార్థులు, నిపుణులు చెప్పారు. కరోనా కారణంగా గతేడాది వరకు సులువుగా ఉన్న పేపర్, ఈసారి కొంత కఠినం చేశారని చెబుతున్నారు. దీంతో ఈసారి కటాఫ్ మార్క్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2020లో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్క్ 147 ఉండగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 113 గా ఉంది. ఇక 2021లో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్క్ 138 కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కట్ ఆఫ్ మార్క్ 108గా ఉంది. గతేడాది (2022)జనరల్ కటాఫ్మార్క్ 117కాగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 93గా ఉంది. ఈ ఏడాది అది కాస్తా జనరల్ కేటగిరీలో 110, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 85 ఉండే అవకాశముందని అంచనా. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు.. గతేడాదితో పోలిస్తే ఈసారి నీట్ పేపర్ కఠినంగా ఉంది. నాలుగేళ్లలో 2020, 21లో పేపర్లు సులువుగా వచ్చాయి. అయితే అంతకుముందుతో పోలిస్తే గతేడాది కఠినంగా ఉంది. దీంతో కటాఫ్ మార్కు తగ్గింది. ఈ ఏడాది ఇంకా టఫ్‌గా ఉంది. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. కెమిస్ట్రీ పేపర్ కఠినంగా ఉంది. సహజంగా విద్యార్థులు కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్‌పై దృష్టిపెట్టి, థియరీ పార్ట్‌ను నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈసారి ఎక్కడో మూలల నుంచి థియరీ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. దీంతో పేపర్ కఠినంగా మారింది. ఇక ఫిజిక్స్ గతేడాదితో పోల్చితే సులువుగానే ఉంది. నాలుగైదు ప్రశ్నలు తికమకగా ఇచ్చారు. ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు ఏవీ కరెక్ట్‌గా లేవు. బాటనీ ప్రశ్నలు సులువుగా ఉన్నా, సుదీర్ఘంగా ఉన్నాయి. చదవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాయి. స్టేట్మెంట్ టైప్ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు విశ్లేషించారు. 430 మార్కులు వచ్చినా రాష్ట్రంలో కన్వీనర్ సీటు.. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి కాబట్టి తక్కువ మార్కులు వచ్చినా సీటు పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు జనరల్ కేటగిరీలో గతేడాది 450 మార్కులు వచ్చినవారికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. ఈ ఏడాది 430 మార్కులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశముంది. గతేడాది 700కు పైగా మార్కులు వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఏడాది అంత మార్కులు వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు సమాధానం లేదు ఈసారి నీట్ పేపర్ కఠినంగా ఉంది. కెమిస్ట్రీ చాలా కఠినంగా వచ్చింది. ఫిజిక్స్‌లో నాలుగైదు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. వాటిని హడావుడిగా పెడితే తప్పవుతాయి. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లు కూడా సరిగా లేవు. కాబట్టి దానికి బోనస్ మార్కులు ఇవ్వాలి. 180 ప్రశ్నల్లో 179 మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, కూకట్పల్లి పేపర్ మధ్యస్థంగా ఉంది నీట్ పరీక్ష బాగానే రాశాను. పేపర్ మధ్యస్థంగా ఉంది. కెమిస్ట్రీ ఫర్వాలేదు. నాకు కెమిస్ట్రీలో 160, ఫిజిక్స్‌లో 166 వచ్చే అవకాశముందని నేను రాసిన ఆన్సర్లను బట్టి అంచనా వేశా. బాటనీలో కూడా మార్కులు బాగానే వస్తాయనుకుంటున్నా. – ఆర్ని గోయల్, విద్యార్థి, హైదరాబాద్ ఫిజిక్స్, బాటనీ సులువుగా.. నీట్ పరీక్ష బాగానే రాశాను. కెమిస్ట్రీలో రెండు ప్రశ్నలు తప్పుగా రాసినట్లు అనిపించింది. కెమిస్ట్రీ మధ్యస్థంగా ఉంది. ఫిజిక్స్, బాటనీ పేపర్లు సులువుగా వచ్చాయి. – లహరి, విద్యార్థిని, హైదరాబాద్ -
అది కాంతార మ్యానియా.. గవర్నమెంట్ ఎగ్జామ్‌లో మూవీపై ప్రశ్న
ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో కన్నడ మూవీ ‘కాంతర’ సృష్టించిన సన్సేషన్ అంతా ఇంత కాదు. కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేజీఎఫ్‌ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్కి ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో రిషబ్ ట్రాన్స్ఫార్మేషన్ అందరికి గూస్బంప్స్ తెప్పించింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ హవా కొనసాగింది. కన్నడ నుంచి బాలీవుడ్ వరకు కాంతార విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. తాజాగా కాంతార మ్యానియా విద్యారంగంలోనూ వ్యాపించింది. ఈ చిత్రం కర్ణాటక గ్రామ ప్రాంతాల్లో నిర్వహించే భూతకోల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపరల్లో కాంతార మూవీపై ప్రశ్న అడిగారు. ఇందుకు క్వశ్చన్ పేపర్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కింది’ అంటూ జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హీరోయిన్ సప్తమి గౌడ్ ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ -
గ్రూప్–1.. కటాఫ్ ఉండదు: టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై అభ్యర్థుల్లో ఇంకా గందరగోళం వీడలేదు. రాసిన ప్రశ్నలకు సరైన జవాబులపై అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక కీ విడుదలైతే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం ఆదివారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 2,86,051 మంది దీనికి హాజరయ్యారు. అభ్యర్థులుగానీ, కోచింగ్ సెంటర్లుగానీ పరీక్ష ముగిసిన తర్వాత నిపుణులు, మేధావులను సంప్రదించి సరైన సమాధానాలపై, తమకు వచ్చే మార్కులపై అంచనాకు రావడం జరుగుతుంది. కానీ ఆదివారం నాటి గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై ఇప్పటికీ అభ్యర్థుల్లో గందరగోళమే కనిపిస్తోంది. ఒకే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉండటమే దీనికి కారణమని.. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు, మూడు సరైన సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతు న్నారు. ఇక ఒకే ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు అడు గుతూ వాటిని జతపర్చాలని సూచించారని అంటున్నారు. విభిన్న రకాలుగా ప్రశ్నలు ఇవ్వడంతో సరైన సమాధానాలను గుర్తించడంలో ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. పరీక్ష జరిగి రెండు రోజులు అవుతున్నా కనీసం కోచింగ్ సెంటర్లు కూడా నమూనా ‘కీ’ని విడుదల చేయకపోవడం గమనార్హం. కటాఫ్ మార్కులేమీ ఉండవు! గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రత్యేకంగా కటాఫ్ మార్కులంటూ ఏమీ ఉండవని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. నోటిఫికేషన్లోనే ఈ అంశాన్ని ప్రత్యేకంగా తెలిపిన కమిషన్.. సోమవారం మరోమారు ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చినవారిని.. మల్టీజోన్ల వారీగా 1ః50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారు. మొత్తం 503 పోస్టులు ఉన్న నేపథ్యంలో.. ఎక్కువ మార్కులు వచ్చిన సుమారు 25,150 మందికి మెయిన్స్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. ప్రశ్నపత్రం కోడింగ్‌లో కొత్త విధానంతో.. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం కోడింగ్‌లో టీఎస్పీఎస్సీ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఇదివరకు కమిషన్ నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రాన్ని ఏ, బీ, సీ, డీ నాలుగు కోడ్లలో తయారు చేసింది. ఈసారి కాపీయింగ్‌కు ఆస్కా రం లేకుండా ఆరు డిజిట్ల కోడ్‌తో ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చింది. విభిన్న రూపాల్లో ప్రశ్నపత్రం తయారైంది. దీనితో ఏ కోడ్‌కు చెందిన ప్రశ్న పత్రానికి నమూనా కీని తయారు చేయాలనే దానిపై కోచింగ్ సెంటర్లు, నిపుణులు సైతం తికమక పడ్డారు. చివరికి ప్రశ్నపత్రం కోడ్‌కు బదులుగా.. పరీక్షలో వచ్చిన ప్రశ్నలు కొన్నింటికి జవాబులను నిర్ధారిస్తూ సామాజిక మాధ్యమాల్లో అంచనాలను పోస్టు చేశారు. పూర్తి స్థాయిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. దీనితో టీఎస్పీఎస్సీ కీ వచ్చేదాకా అంచనాకు వచ్చే పరి స్థితి లేదని అభ్యర్థులు అంటున్నారు. కమిషన్ కీ విడుదల చేసేందుకు పదిరోజుల సమయం పడు తుందని అంచనా వేస్తున్నారు. ముందుగా అభ్య ర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చిన తర్వాతే ‘కీ’ని విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. -
ప్రశ్నలు మధ్యస్థం... జవాబులు కఠినం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని కొందరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష స్థాయితో పోల్చగా మరికొందరు అంతకుమించి కఠినంగా ఉందని చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ పరీక్షలో 100 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తుండగా... గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయమే ఇవ్వడంతో ప్రశ్న చదివి జవాబు రాయడం క్లిష్టంగా మారిందని ఎక్కువ మంది అభ్యర్థులు చెప్పారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు జవాబుల ఎంపికకు ఎక్కు వ సమయం పట్టిందన్నారు. నాలుగు జవాబుల్లో ఏ ఏ మూడు సరైనవి అంటూ ఇచ్చిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయన్నారు. ఇక రీజనింగ్ విభాగం నుంచి 10 శాతం లోపే ప్రశ్నలు ఉండాల్సి ఉన్నా 15 శాతానికిపైగా ప్రశ్నలు వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరెంట్ అఫైర్స్‌లో వచ్చి న ప్రశ్నలు లోతైన అంశాలతో అడగటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఒకట్రెండు ప్రశ్నలు ఆంగ్లం, తెలుగులో వేర్వేరు అర్థాలు వచ్చేలా ఉన్నట్లు చెప్పారు. 50 శాతం పైబడి మార్కులతో కటాఫ్...! ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ వెలువడే వరకు సమాధానాలను అంచనా వేయడం కష్టంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జవాబుల సరళిని విశ్లేషిస్తే కనీసం 50% పైబడి మార్కులతో కటాఫ్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పురుషుల కేటగిరీలో 85 మార్కులు, మహిళల కేటగిరీలో 80 మార్కులకు అటుఇటుగా కటాఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
ఇంటర్లో ఇక 100% సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షల్లో ఇక నుంచి వందశాతం సిలబస్‌తో ప్రశ్నప త్రాలు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే విద్యార్థులు సిద్ధమవ్వాలని, కాలేజీ నిర్వాహకులు కూడా 100 శాతం సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ ముందు వరకూ ఇదే విధానం కొనసాగింది. కోవిడ్ విజృంభణతో 2021లో 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. అయితే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. 2021–22లో కూడా చాలాకాలం ఆన్లైన్ క్లాసులు నడిచాయి. ఈ సదుపాయం అన్ని ప్రాంతాలు వినియోగించుకోలేదన్న ఆందోళన సర్వత్రా విన్పించడంతో 70 శాతం సిలబస్‌నే అమలు చేశారు. తొలుత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవని చెప్పినప్పటికీ ఆ తర్వాత నిర్వహించారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 70 శాతం సిలబస్ కూడా సరిగా జరగలేదని విద్యార్థులు ఆందోళనలకు దిగారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. 2022లో మేలో జరిగిన పరీక్షల్లో 70 శాతం సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం సకాలంలో మొదలవ్వడంతో వందశాతం సిలబస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే మొదటి సంవత్సరం ప్రవేశాలు సెప్టెంబర్ వరకూ జరిగాయి. బోర్డు నిర్దేశించిన సిలబస్ కూడా పూర్తవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. కాకపోతే 100 శాతం సిలబస్ ఉంటుందని ముందే చెప్పడంతో సిద్ధమవ్వడానికి కొంత వ్యవధి లభించిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మోడల్ పేపర్ల తయారీపై బోర్డు దృష్టి పెట్టినట్టు లేదు. కోవిడ్‌కు ముందు ఇదే సిలబస్‌తో నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించారు. వాటినే బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. -
తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు
-
ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సంస్కృతం, హిందీ పేపర్లలో తప్పులురాగా.. గురువారం పొలిటికల్ సైన్స్, ఉర్దూ మీడియం మ్యాథ్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరితో పరీక్షల విధానం ప్రహసనంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నే మారిపోయింది రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరి గాయి. సాధారణంగా విద్యార్థులు ఏ మీడియంలో పరీక్ష రాస్తే ఆ భాషలో ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇస్తారు. ఇందులో భాష మారుతుందే తప్ప ప్రశ్నల్లో మార్పు ఉండదు. గురువారం ఇంగ్లిష్ మీడి యం పొలిటికల్ సైన్స్ పేపర్లో ఒక ప్రశ్న ఉంటే.. తెలుగు మీడియం పేపర్లో వేరే ప్రశ్న ఇచ్చారు. ప్రశ్నపత్రం సెక్షన్ ‘బి’లో ఐదు మార్కులకు 8వ ప్రశ్నగా "Point out the main provisi ons of the Independence of India Act 1947' అని ప్రశ్న ఇచ్చారు. ‘భారత స్వాతంత్య్ర చట్టం–1947లోని ముఖ్యాంశాలు రాయండి’అని దానికి అర్థం. కానీ తెలుగులో ఇచ్చిన పొలిటికల్ సైన్స్ పేపర్లో ‘భారత స్వాతంత్య పోరాటంలో హోమ్‌రూల్ ఉద్యమాన్ని వర్ణించండి’అనే ప్రశ్న ఇచ్చారు. ఇలా వేర్వేరుగా రావడంతో.. ఏ ప్రశ్నను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది, దేనికి మార్కులు వేస్తుందని విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కొందరు ఈ ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేశారు. మరికొందరు సమాధానం రాసినా మార్కులు రావేమోనని భయపడటం పరీక్ష కేంద్రాల వద్ద కన్పించింది. ఉర్దూలోనూ ఇదే తంతు గణితం పేపర్‌ను కొందరు విద్యార్థులు ఉర్దూ మీడియంలో రాశారు. అందులో ఇచ్చిన ఓ ప్రశ్న అర్థం లేకుండా ఉండటంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఒక లెక్కలో" FARJI'’అని ఇచ్చారు. అదేంటో ఎవరికీ అర్థం కాలేదు. విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నించడంతో.. ఇన్విజిలేటర్లు, పరీక్ష కేంద్రం సిబ్బంది అప్పటికప్పుడు ఆ పదం అర్థమేంటో తెలుసుకునేందుకు హైరానా పడ్డారు. ఉర్దూ భాషా నిపుణులను సంప్రదించగా.. ఆ పదం " ZARBI' అని, లెక్కలో హెచ్చింపు అని అర్థమని చెప్పారు. ఇది పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు చేరేసరికి సమయం వృధా అయింది. వరుస తప్పిదాలు.. ఎందుకిలా? ఇంటర్‌బోర్డు నిపుణుల చేత అత్యంత గోప్యంగా పరీక్ష పత్రాలను తయారు చేయిస్తుంది. మొత్తం 12 సెట్లు రూపొందిస్తారు. అందులోంచి మూడింటిని ఎంపిక చేసి.. పరీక్ష కేంద్రాలకు పంపుతారు. పరీక్షకు సరిగ్గా అరగంట ముందు ఈ మూడు సెట్లలో ఒక సెట్‌ను ఖరారు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో కొందరు అనుకూలమైన వ్యక్తులకు బాధ్యత అప్పజెప్పారని, వారికి అనుభవం లేకపోవడమే తప్పిదాలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కుమ్మక్కైనట్టు విమర్శలొస్తున్నాయి. ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలోనే కార్పొరేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. హిందీ ట్రాన్స్‌లేటర్లు ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకపోవడం వెనుక కొందరు పైరవీకారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. ఏదేమైనా పరీక్షల విభాగంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ కూడా విన్పిస్తోంది. వేర్వేరుగా మూల్యాంకనం పొలిటికల్ సైన్స్ పేపర్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో వేర్వేరుగా ప్రశ్నలు ఇవ్వడాన్ని గుర్తిం చాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరుగా మూల్యాంకనం చేపడతాం. రెండు భాషల్లోనూ రెండు ప్రశ్నలకు మార్కులు వేస్తాం. – సయ్యద్ ఒమర్ జలీల్, బోర్డు కార్యదర్శి ఇలాగైతే విద్యార్థుల్లో కంగారే.. లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నప్పుడు ఇలాంటి తప్పిదాలు రాకుండా చూడాలి. పరీక్ష హాల్లో విద్యార్థులు ఇలాంటి గందరగోళానికి లోనైతే.. సక్రమంగా పరీక్ష రాసే అవకాశం ఉండదు. ఆ రోజు పరీక్షపై ప్రభావం చూపుతుంది. – పరశురాములు, జూనియర్ లెక్చరర్ -
సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం
స్టేషన్‌ఘన్‌పూర్: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో సిబ్బంది సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన ఘటన జనగామ జిల్లా నమిలిగొండ శివా రు మోడల్ స్కూల్లో చోటుచేసుకుంది. మహబూబాబాద్‌కు చెందిన హర్షి త శనివారం సంస్కృతం పేపర్ రాసేందుకు నమిలిగొండ శివారు మోడల్ స్కూల్లోని పరీక్ష కేంద్రానికి హాజరైంది. ఆమెకు ఇన్విజిలేటర్ సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. అది తన సబ్జెక్ట్ కాదని తెలిసినా.. ఏం చేయాలో తోచక సదరు విద్యార్థిని పరీక్ష ముగిసే వరకు కూర్చుండిపోయింది. బయటకు వచ్చాక తండ్రికి విషయం చెప్పగా.. ఆయన సిబ్బందికి, సెంటర్ ఇన్చార్జి శ్రీకాంత్ డీఐవో శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘నవోదయ’ ప్రశ్నపత్రంలో తప్పులు
కోడూరు: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30న నిర్వహించిన పరీక్షలో తప్పులు దొర్లాయి. తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో నాలుగు మ్యాథ్స్ ప్రశ్నల్లో అనువాద, అన్వయ లోపాల కారణంగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మ్యాథ్స్ ప్రశ్నల్లో తెలుగు అనువాదం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తెలిసిన ప్రశ్నలే అయినప్పటికీ జవాబు గుర్తించేందుకు తికమకపడ్డారు. ప్రశ్నపత్రం ‘హెచ్’ కోడ్‌లో 48వ ప్రశ్న ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఏవి?’ అని ఉంది. అయితే ఈ ప్రశ్నకు ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఎన్ని’ అని ఉంటే విద్యార్థులు సరైన సమాధానం గుర్తించేవారు. 47వ ప్రశ్న ‘ఒక అంకె నుంచి తీసివేయబడిన అంకె ఇవ్వబడింది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని తప్పుగా ఇచ్చారు. అయితే.. ‘ఒక సంఖ్యలోని అంకెల మొత్తం నుంచి అంకె తీసివేయబడుతుంది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 44వ ప్రశ్న.. ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ గుణకం వల్ల వస్తుంది’ అని ఉంది. ఇది ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ ప్రధానాంకాల గుణకం వల్ల వస్తుంది’ అని ఉండాలి. 42వ ప్రశ్న అనువాదం తప్పుగా ఉండడం వల్ల ఆ ప్రశ్న విద్యార్థులకు అర్థం కాలేదు. నవోదయ పరీక్షలో సీటు సాధించడానికి ప్రతి మార్కు ఎంతో విలువైనది కావడంతో విద్యార్థులు ఈ నాలుగు ప్రశ్నల వల్ల తాము సీటు కోల్పోయే పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై కృష్ణా జిల్లా కోడూరు ఎంఈవో టి.వి.ఎం.రామదాసు, గణితం ఉపాధ్యాయులు రేపల్లె జయపద్ర, కో–ఆర్డినేటర్ మన్నె ప్రేమ్‌చంద్ మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగేలా తప్పులు ఉన్న 4 ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నవోదయ విద్యాలయ సమితిని కోరారు. -
విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు.. వీసీ సీరియస్
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీ డిగ్రీ పరీక్షల 6వ సెమిస్టర్ ప్రశ్నాపత్రం ఓ ప్రయివేటు కళాశాలకు చెందిన విద్యార్థుల వాట్సాప్‌గ్రూపులో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని వీసీ మల్లేశ్ సీరియస్‌గా తీసుకున్నారు. డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలకు కోవిడ్ కారణంగా సెల్ఫ్సెంటర్లు ఏర్పాటుచేశారు. దీని కారణంగా కొన్ని ప్రయివేటు కళాశాలల్లో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరిగిందని గుర్తించిన వీసీ 12వ తేదీ నుంచి జరుగుతున్న 4, 6వ సెమిస్టర్లకు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తుండగా.. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను పట్టుకొని కేసు నమోదుచేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సెల్ఫోన్లలో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడాన్ని వీసీ సీరియస్‌గా తీసుకున్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై శాతవాహన వీసీ మల్లేశ్ నలుగురితో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదే శించారు. గురువారం కమిటీ తన పనిని ప్రారంభించగా.. శనివారం దీనిపై ప్రత్యేకసమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహా రంలో కొన్ని ప్రముఖ కళాశాలలకు చెందిన వారి హ స్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి నుంచి లీకవుతున్నాయి.. ఎస్సారార్ కళాశాల కేంద్రంలో పరీక్ష రాస్తున్న నగరానికి చెందిన ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం రావడం, అప్పుడే వర్సిటీ అధికారులకు సమాచారం చేరడంతో విషయం బయటకు పొక్కింది. కానీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కొన్ని రోజుల నుంచే జరుగుతోందని చర్చ జరుగుతోంది. కొంతమంది విద్యార్థులు పేపర్ లీక్ విషయం కొత్తేమి కాదని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బుధవారం పలువురు విద్యార్థుల సెల్ఫోన్లలో ప్రత్యక్షమైన ప్రశ్నాపత్రం వర్సిటీవ్యాప్తంగా వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ నిఘా శాతవాహనలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిసింది. వర్సిటీ వేసిన ప్రత్యేక కమిటీతో నిజం తేలిన తర్వాత బాధ్యులపై చర్యలకు యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని చర్చజరుగుతోంది. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వర్సిటీలో గురువారం జరిగిన ఒక సమావేశంలో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకు సీజ్చేసిన తొమ్మిదిసెల్ఫోన్లు ఇవ్వమని వీసీ స్పష్టం చేశారు. -
కామన్ పేపర్.. ఎక్కువ చాయిస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు కామన్ పేపర్‌తో ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రశ్నలతో పరీక్ష ప్రశ్న పత్రాలు రూపొందించే అంశాల పై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల పరీక్షలు, విద్యా కార్యక్రమాలపై జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పలు యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూజీసీ మార్గదర్శకాల జారీ కంటే ముందుగానే డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి, మార్కులతో సంబంధం లేకుండా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకు యూనివర్సిటీలు కూడా సిద్ధం కావాలని పేర్కొంది. యూనివర్సిటీ స్థాయిలోనూ పరీక్షల విభాగం నియంత్రణాధికారులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలతో చర్చించి నివేదికలు సిద్ధం చేసుకోవాలని పాపిరెడ్డి ఆదేశించారు. నాలుగు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని, అందులో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో తాము తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించాలని నిర్ణయించారు. చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు త్వరలోనే నిర్ణయం.. వీలైతే జూన్ 20 నుంచి లేకపోతే జూలై 1 నుంచి ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. మిగతా సెమిస్టర్ల వారికి జూలై 15 నుంచి నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే వారికి పరీక్షలు నిర్వహించాలా.. యూజీసీ చెప్పినట్లు కిందటి సెమిస్టర్ మార్కుల ఆధారంగా మార్కులు ఇవ్వాలా.. అన్న దానిపై త్వరలో నిర్వహించే సమావేశంలో నిర్ణ యం తీసుకోనున్నారు. పరీక్ష సమయాన్ని 3 గంటలు నుంచి 2 గంటలకు కుది ంచాలనే యోచనలో ఉంది. కామన్ పేపరు విధానం అవలంబించాలని, ఎక్కువ ఆప్షన్లు ఉండేలా ప్రశ్నల సరళి ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తంగా 10 నుంచి 14 వరకు ప్రశ్నలు ఇచ్చి అందులో సగం (5 నుంచి 7 ప్రశ్నలకు) ప్రశ్నలకు జవాబు రాయాలనే విధానం అమలుపై యోచిస్తున్నారు. వీలైతే ఆబ్జెక్టివ్‌లోనూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ చెప్పినా, రాష్ట్రంలో విద్యార్థులకు డిస్క్రిప్టివ్ విధానం అలవాటు ఉండటంతో ఇబ్బంది పడతారనే ఆలోచనతో దాని అమలు అవసరం లేదన్న భావనకు వచ్చారు. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు -
మారిన ప్రశ్నపత్రం
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ఈనెల 5వ తేదీన జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలో ఓ విద్యార్థినికి కొత్త సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం బదులు పాత సిలబస్ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఆ విద్యార్థిని పరీక్ష రాసి బయటకు వచ్చి తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సమయంలో ప్రశ్నపత్రం మారిపోయిందని తెలుసుకుని ఆందోళన చెందింది. ఈనెల 5వ తేదీన సీనియర్ ఇంటర్ విద్యార్థులకు జనరల్‌కు సంబంధించి తెలుగు, సంస్కృతం, హిందీ, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు (జీఎఫ్‌సీ) పరీక్ష జరిగింది. అదేరోజు నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న ఓ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఒకేషనల్ కోర్సుకు సంబంధించి పరీక్ష రాశారు. ఓ విద్యార్థినికి కొత్త సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడున్న పరీక్షల నిర్వహణ సిబ్బంది హడావుడిగా ప్రశ్నపత్రాలను అందజేశారు. విద్యార్థిని పరీక్ష రాస్తున్న సమయంలో కొత్త సిలబస్‌కు చెందిన ప్రశ్నపత్రమా లేక పాత సిలబస్‌కు చెందినదా అని గ్రహించలేక పోయింది. తీరా పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత అది పాత సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం అని తెలుసుకుని అవాక్కైంది. వెంటనే పరీక్షా కేంద్రంలో ఉన్న అధికారులకు చెప్పడంతో వారు కొత్త సిలబస్ ప్రశ్నపత్రం ఇచ్చి గంట సమయం ఇచ్చి పరీక్ష రాయించారు. విచారిస్తా కొత్త ప్రశ్నపత్రం బదులు పాత ప్రశ్నపత్రం ఇచ్చిన విషయం నా దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని చీప్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకుంటాను. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసులు, ఆర్ఐఓ -
గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?
అహ్మదాబాద్: అదేంటి మహాత్మా గాంధీ ఆత్మహత్య చేసుకోవడమేంటి అనుకుంటున్నారా? గాంధీని గాడ్సే చంపారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ, గుజరాత్‌లోని ఓ పాఠశాల ప్రశ్నపత్రంలో మాత్రం గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? అనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయిన విద్యాశాఖాధికారులు దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. ‘సుఫలాం శాల వికాస్ సంకుల్ పేరిట గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న పాఠశాలలో 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షలో ఈ ప్రశ్న అడిగారు’అని ఓ అధికారి తెలిపారు. కాగా, 12వ తరగతి విద్యార్థులకు ‘మీ ప్రాంతంలో మద్యం అమ్మకాలు పెంచడానికి ఏం చేయాలో తెలుపుతూ పోలీస్ ఉన్నతాధికారికి లేఖ రాయండి’అనే మరో విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ జిల్లా విద్యాధికారి భరత్ వధేర్ వెల్లడించారు. -
గవర్నర్ ఒక కీలుబొమ్మ.. అవునా?
పట్నా: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఓ వింత ఈ ప్రశ్న చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. ‘భారతదేశంలో, మరీ ముఖ్యంగా బిహార్ రాష్ట్రంలో గవర్నర్ కీలుబొమ్మేనా..?’ అన్న ప్రశ్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. బిహార్‌లో ఆదివారం బీపీఎస్సీ మెయిన్స్ పరీక్ష జరగ్గా సెకండ్ పేపర్లో ఈ ప్రశ్న అడిగారు. ఏం సమాధానం రాయాలో తెలీక విద్యార్థులు తల గోక్కున్నారు. ఈ ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనిపై అక్కడి ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) తీవ్రంగా స్పందించింది. గవర్నర్ పదవిని అపహాస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర మాట్లాడుతూ.. ఆ ప్రశ్నను తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవేకాకుండా మరిన్ని ప్రశ్నలు కూడా విమర్శలకు తావిచ్చాయి. ‘భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న రాజకీయ పార్టీలపై మీ అభిప్రాయం తెలపండి? అలాగే వాటివల్ల లాభనష్టాలను పేర్కొండంటూ మరో ప్రశ్న కనిపిస్తుంది. దీంతో పాటు ‘భారత్‌లో న్యాయస్థానాల క్రియాశీలత’ గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృష్ణనందన్ ప్రసాద్‌వర్మ స్పందించారు. ప్రశ్నపత్రం రూపొందించడంలో తప్పిదం జరిగిందని వివరించారు. -
అనువాదం..అయోమయం
ఏపీపీఎస్సీ తీరు మారనంటోంది. చిన్నపోస్టులకూ కఠినమైన ప్రశ్నలు సంధిస్తోంది. ఇది చాలదన్నట్టూ ఇంగ్లిషు, తెలుగు అనువాదంలో గందరగోళం సృష్టిస్తోంది. ఏది తప్పో.. ఏది కరెక్టో తెలియక తలలుపట్టుకునేలా చేస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి అన్నమయ్యసర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 430 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల నియామకానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆయా పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి దాదాపు 6,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం జిల్లాలో తిరుపతి కేంద్రంగా 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆదివారం జరిగిన పరీక్షకు 58.09శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. గందరగోళంగా ప్రశ్నాపత్రం ఆదివారం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పరీక్ష ప్రశ్నాపత్రం గందరగోళంగా ఉందని అభ్యర్థులు విమర్శించారు. ప్రధానంగా తెలుగు, ఇంగ్లిష్ అనువాదంలో తప్పులు దొర్లాయని ఆరోపించారు. ప్రశ్నలు రెండు భాషల్లోనూ ఒకే విధంగా ఉన్నా, నాలుగు ఆప్షన్లలో ఇచ్చిన జవాబుల్లో పూర్తిగా సంబంధం లేని విధంగా ఉండడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇదిలా ఉంటే మ్యాథ్స్ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సైన్స్, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు సివిల్స్ పరీక్షను తలపించాయని అభ్యర్థులు వాపోయారు. ప్రశ్నల సరళి గతం కంటే భిన్నంగా తికమక కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ఇంటర్ విద్యార్హతతో నిర్వహించే ఈ పరీక్షను కఠినమైన ప్రశ్నలతో ఇవ్వడం దారుణమని అభ్యర్థులు, వివిధ విద్యార్థి సంఘాలు, మేధావులు విమర్శించారు. మితిమీరుతున్న విమర్శలు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పరీక్ష వివాదాస్పదంగా మారిందని మేధావులు చెబుతున్నారు. ఆదివారం జరిగిన పరీక్షే కాకుండా గతంలో జరిగిన గ్రూప్–1, 2, 3తో పాటు డిపార్టమెంటల్ పరీక్షల్లో కూడా ప్రశ్న పత్రాల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీపీఎస్సీ తీరులో ఎటువంటి మార్పు రాలేదు. రాష్ట్రంలో కొత్తగా కొలువైన ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్యాథ్స్ కఠినం మ్యాథ్స్ కఠినంగా అనిపించింది. జనరల్ సైన్స్ సులువుగా ఉన్నా కరెంట్ అఫైర్స్‌పై అధిక ప్రశ్నలు వచ్చాయి. మొత్తానికి ఈ ప్రశ్న పత్రం ఇంటర్ స్థాయిలో లేదు. కొంత కఠినంగా ఉంది. ప్రశ్నలు తారుమారుగా ఇవ్వడంతో సమయం వృథా అయ్యింది. – లేఖశ్రీ, అభ్యర్థిని, తిరుపతి అనువాదంలో అయోమయం తెలుగు, ఇంగ్లిష్ ప్రశ్నల విషయంలో అనువాదం సరిగ్గా లేదు. అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. గణితంలో ఇచ్చిన ప్రశ్నలు గ్రూప్–1 స్థాయిని తలపించింది. సైన్స్, కరెంట్ అఫైర్స్ కొంత సులువుగా ఉన్నాయి. – అభిలాష్, అభ్యర్థి, తిరుపతి ఆప్షన్స్‌లో గందరగోళం తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఆప్షన్స్‌లో ఇచ్చిన జవాబుల్లో గందరగోళం నెలకొంది. తెలుగులో ఒకలా, ఇంగ్లిష్‌లో మరోలా జవాబులున్నాయి. ఏది సరి, ఏది తప్పు అని గుర్తించడంలో కొంత గందరగోళం నెలకొంది. – నాగమణి, అభ్యర్థిని, అనంతపురం ప్రశ్నల సరళి విభిన్నం గత మోడల్ పేపర్ కంటే ప్రస్తుత పరీక్షలో ప్రశ్నల సరళి విభిన్నంగా ఉంది. చాలా ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు. ఎక్కువ భాగం సైన్స్, కరెంట్ అఫైర్స్‌లో సంధించారు. ప్రశ్న పత్రం విభిన్నంగా ఉండడంతో అర్థం చేసుకోవడానికే సమయం సరిపోయింది. – జనార్థన్, అభ్యర్థి, తిరుపతి కొత్త ప్రభుత్వంపై ఆశలు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసే దిశగా నూతన ప్రభుత్వం వ్యవహరిస్తుందని భావిస్తున్నాం. నిరుద్యోగులు సైతం నూతన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ను రూపొందించి ప్రతి ఏటా ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నిరుద్యోగులకు అండగా ఉంటుందని ఆశిస్తున్నాం. – డి.సుబ్రమణ్యంరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
వరంగల్‌లో ఇంటర్ ప్రశ్నాపత్రాల గల్లంతు
-
అవాక్కవకుండా ఆన్సర్ చెప్పండి.!
సాక్షి, బెంగుళూరు: క్వశ్చన్ పేపర్ కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో టీచర్..! కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో అయ్యగారి ఉద్యోగమే ఊడింది. రాజరాజేశ్వరి నగర్‌లోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్లో తయారు చేసిన 8వ తరగతి ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినటానికి తమాషాగా అనిపించినా, అసలే ఎన్నికల సమయం కావటంతో విమర్శలకు దారితీసింది. ఇంతలా తిప్పలు పెట్టిన ప్రశ్న ఏంటంటే... రైతు మిత్రులు ఎవరు? అన్న ప్రశ్నకు ...సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఎ. కుమారస్వామి బి. వానపాములు సి. యడ్యూర్పప్ప... ఆప్షన్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన విద్యార్థులు ఆ తర్వాత తేరుకొని తడుముకోకుండా సమాధానాన్ని ఎంచుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కాదని విద్యార్థులు... రైతు మిత్రులుగా వానపాములకే ఓటేశారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో స్కూల్ యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన టీచర్‌ను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని సంజాయిషీ ఇచ్చుకుంది. -
గ్రూప్–4 ప్రశ్నపత్రంలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్– 4 పరీక్ష గందరగోళంగా జరిగింది. దీంతో ఆదివారం పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. పేపర్–1 సెట్ బీలోని ప్రశ్నలు సెట్–ఏలో కనిపించాయి. ప్రశ్నపత్రంలో తలెత్తిన తప్పుల వల్ల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. పేపర్– 1 పరీక్షలో ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో విద్యార్థులకు కొన్ని పేజీలు మిస్సయ్యాయి. మరోవైపు బీ సిరీస్ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా కొన్ని రిపీట్ అయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. ఏ సిరీస్ ప్రశ్నప్రత్రంలో బీ సిరీస్‌కు చెందిన 16, 17, 18, 19, 20, 21, 45, 46, 63, 64, 65, 73, 74, 75, 90, 91, 92, 93, 100, 101, 119, 120, 121, 122, 123, 124 తదితర ప్రశ్నలు ఒక సిరీస్‌కు బదులు మరో సిరీస్‌లో వచ్చాయి. ఏ సిరీస్, బీ సిరీస్ రెండూ ఒకే ప్రశ్నపత్రంలో ఉన్నందున పరీక్ష సరిగా రాయలేకపోయామని అభ్యర్థులు ఆరోపించారు. అయితే టీఎస్ పీఎస్సీ మాత్రం కొన్ని పొరపాట్లు దొర్లినందున అందుబాటులో ఉన్న మరో పేపర్ ఇచ్చి పరీక్ష రాయించామని తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని శ్రీచైతన్య కళాశాలలో గ్రూప్– 4 పరీక్షలు రాస్తున్న 6 అభ్యర్థులకు ఏ–1 సిరీస్ ప్రశ్నపత్రంలో బీ సిరీస్ ప్రశ్నలు వచ్చాయి. దీంతో విషయాన్ని ఇన్విజిలేటర్లకు చెప్పగా వారు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఒక దశలో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షలు పూర్తయినప్పటికీ తమకు న్యాయం చేయాలని వారు టీఎస్పీఎస్సీని కోరారు. 65 శాతం హాజరు..: గ్రూప్–4 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.80 లక్షల మందికిగాను 3.12 లక్షల (65 శాతం) మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 1,046 కేంద్రాల్లో జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లా లో 75 శాతం మంది, ఆ తర్వాత వరంగల్, మహ బూబ్‌నగర్ జిల్లాల్లో 74 శాతం చొప్పున హాజరయ్యారని వెల్లడించారు. ఇక, ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 12 శాతం మాత్రమే హాజరైనట్లు ఆమె వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బిల్ కలెక్టర్లు, టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు, అలాగే టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. -
నీట్ 2018 : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ)ను ఆదేశించింది. ఈ మేరకు నీట్ 2018 ర్యాంకు లిస్టును రెండు వారాల్లోగా పునః పరిశీలించాలని పేర్కొంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్సీ తీరును తప్పు పట్టింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ పెండింగ్‌లో ఉండగానే ర్యాంకు లిస్టు ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరంకుశంగా వ్యవహరించారు.. తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లలేదని సీబీఎస్సీ ఏ ప్రాతిపదికన చెబుతుందో వివరించాలని కోర్టు ఆదేశించింది. మెజారిటీ ప్రజలు సమర్థించినంత మాత్రాన తప్పులు ఒప్పులై పోవు కదా అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. పిల్ విచారణ కొనసాగుతుండగానే ర్యాంకు లిస్టు విడుదల చేయడం ద్వారా సీబీఎస్సీ నిరంకుశంగా వ్యవహరించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనువాద తప్పిదాల వల్ల విద్యార్థులు మార్కులు కోల్పోయారన్న వాదనను సీబీఎస్సీ తేలికగా తీసుకోవడం బాధ్యత రాహిత్యమేనని మండిపడింది. సైన్సు విభాగంలో ఆంగ్ల పదాలతో సరిపోయే తమిళ పదాలను రూపొందించడానికి ఎటువంటి ప్రమాణాలు పాటించిందో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఎస్సీని ఆదేశించింది. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
పది ప్రశ్నపత్రం లీక్
నార్నూర్(ఆసిఫాబాద్): పదో తరగతి పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లిషు పేపర్–2 ప్రశ్నపత్రం లీక్ కావడం, వాట్సాప్‌లో వైరల్‌గా మారడం ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో సోమవారం కలకలం సృష్టించింది. విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ నెల 15న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు నిర్వహిస్తు న్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఇంగ్లిషు పేపర్–2 పరీక్ష ప్రారంభమైన గంటకు అంటే 10.30 గంటలకు వాట్సాప్‌లో ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం హల్చల్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పరీక్ష కేంద్రంలో తీసిన ప్రశ్నపత్రం ఫొటో, విద్యార్థులు గోడ దూకి నకలు చిట్టీలు అందిస్తున్న ఫొటోలనూ పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా.. ప్రశ్నపత్రం లీక్ కాలేదని, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నామని తొలుత బుకాయించారు. అంతా సవ్యంగానే జరుగుతున్నాయని సర్ది చెప్పా రు. లీకైన ప్రశ్నపత్రం కింద విద్యార్థి హాల్‌టికెట్ నంబ రు ఉండడం, ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తి స్తున్న ఉపాధ్యాయురాలు కృష్ణవేణి చీర ఫొటోలో కని పిస్తుండడంతో నిజమేనని నిర్ధారణ జరిగింది. ఈ విషయం కలెక్టర్ దివ్యదేవరాజన్ దృష్టికి వెళ్లింది. వెంటనే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలియజేయాలని ఆమె ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఈవో జనార్దన్‌రావులను ఆదేశించారు. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించడంతో అధికారులు హుటాహుటిన పరీక్ష కేంద్రానికి చేరుకుని విచారణ జరిపారు. రూం నంబర్ 1లో.. పరీక్ష కేంద్రంలోని రూంనంబర్ ఒకటిలో ప్రశ్నపత్రం లీకైనట్లు అధికారులు ధ్రువీకరించారు. అనంతరం పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ భరత్‌చౌహాన్ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ హానోక్ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పాఠశాలలో విచారణ జరిపారు. వాట్సాప్‌లో పేపరు లీక్ వ్యవహారంపై దృష్టి సారించారు. సెల్ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్‌లో పంపినట్లు విచారణలో తేలిం ది. సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని, పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్ తీసుకెళ్లడంపై కఠినంగా వ్యవహరిస్తామని అధికా రులు తెలిపారు. ఇన్విజిలేటర్ కృష్ణవేణి, చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) భరత్ చౌహాన్, డిపార్టుమెంటల్ ఆఫీసర్(డీవో) జగన్మోహన్, సిట్టింగ్ స్క్వాడ్ జాడే నాగోరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, ఇన్విజిలేటర్ కృష్ణవేణి నార్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మండలంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూం నంబర్–1లో బ్లాక్ బోర్డుపై రెండో వరుసలో ఉన్న విద్యార్థి హాల్‌టికెట్ నంబర్ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం తాడిహత్నూర్ పరీక్ష కేంద్రం నంబర్ 1040లో పదో తరగతి ఇంగ్లిష్ పేపర్–2 ప్రశ్నపత్రం సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపించి లీక్ చేసినట్లు విచారణలో తేలింది. పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్‌కు అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ కృష్ణవేణి, సీఎస్ భరత్ చౌహాన్, డీవో జగన్మోహన్, సిట్టింగ్ స్క్వాడ్ జాడే నాగోరావులపై శాఖా పరంగా చర్యలు తీసుకుంటాం. పేపర్ లీకైనా.. బయట నుంచి జవాబులు విద్యార్థులకు అందలేదు కాబట్టి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతోపాటు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రావు, ఆదిలాబాద్ కలెక్టర్‌కు నివేదిక అందిస్తా.. పదో తరగతి ఇంగ్లిషు పేపర్–2 లీకైన మాట వాస్తవమే. పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్ అనుమతి లేదు. రూమ్ నంబర్ ఒకటిలో ఫొటో తీసినట్లు తేలింది. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తా. – ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ఉట్నూర్ లీక్ కాలేదు.. మాల్‌ప్రాక్టీస్: కలెక్టర్ నార్నూర్ మండలం తడిహత్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ కాలేదని, మాల్‌ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని కలెక్టర్ దివ్య అన్నారు. సోమవారం సా యంత్రం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సోమవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్–2 లీక్ అయ్యిందన్న ప్రచారం అవాస్తమని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికి మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించామని అన్నారు. ఉట్నూర్ ఆర్డీవోతో విచారణ జరి పించి చీఫ్ సూపరింటెం డెంట్ భరత్ చౌహన్, డిపార్ట్మెంటల్ అధికారి జగన్మోహన్, కస్టోడియన్ అధికారి నాగోరావ్, ఇన్వి జిలెటర్ కృష్ణవేణిలను పరీక్షల నిర్వహణ విధుల నుంచి తొలగించడంతోపాటు సస్పెండ్ చేశామని చెప్పారు. పోలీసు కేసు నమోదు చేశామని, పరీక్ష కేం ద్రాల్లో మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ తదితర చర్యలను సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 15న జరిగిన పరీక్షలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్‌గా నిర్వహించిన ఉట్నూర్ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాదవ్ సుమన్, డిపార్ట్మెంటల్ అధికారి ఇంద్రవెల్లి ఆశ్రమ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ యాసిన్ షరీఫ్, ఇన్విజిలేటర్లు ఉట్నూర్ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధా నోపాధ్యాయురాలు రాథోడ్ చంద్రకళ, ఉట్నూర్ ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ జె.రమేశ్ కుమార్‌లను పరీక్ష నిర్వహణ విధుల నుంచి తొలగించడంతోపాటు సస్పెండ్ చేశామని వివరించారు. వీరిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఈవో జనార్దన్‌రావు, అడిషినల్ ఎస్పీ మెహన్, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బీకాం విద్యార్థుల ప్రశ్నపత్రం తారుమారు
డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరీక్షల విభాగం డొల్లతనం మరోసారి బయటపడింది. బీకాం ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు అందజేయాల్సిన పేపర్ తారుమారు (ఒక ప్రశ్నపత్రం బదులు మరోప్రశ్నపత్రం ఇవ్వడం) అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సప్లిమెంటరీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వడంతో వారంతా తీవ్ర గందరగోళంలో ఉన్నారు. తమకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. శ్రీకాకుళం: బీఆర్‌ఏయూ పరిధిలో గతనెల 24 నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఐదో సెమిస్టర్, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఇందులో బీకాం ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా ఈనెల 13వ తేదీన ఫండమెంటల్ అకౌంటింగ్ పరీక్ష జరిగింది. అయితే వీరికి ఇచ్చిన ప్రశ్నపత్రం తారుమారైంది. 2016–17 బ్యాచ్‌కు చెందిన రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రం ఇవ్వకుండా.. సప్లిమెంటరీ (2015–16) విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. తమ ప్రశ్నాపత్రమే ఆనుకుని వారంతా పరీక్ష రాసేశారు. జిల్లాలో శ్రీకాకుళం నగరంతోపాటు చాలా ప్రాంతాల్లోని కేంద్రాల్లో ప్రశ్నపత్రం తారుమారైనట్లు విద్యార్థులు ఆలస్యంగా గుర్తించారు. స్కోరింగ్ సబ్జెక్ట్ అకౌంటింగే! వాస్తవానికి బీకాం విద్యార్థులకు ఫండమెంటల్/ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్‌ను స్కోరింగ్ సబ్జెట్‌గా అంతా భావిస్తారు. సెమిస్టర్ విధానంలో జరుగుతున్న పరీక్షలకు గత ఐదు మాసాలగా సన్నద్ధమయ్యారు. అయితే పరీక్షలకొచ్చేసరికి తమది కాని ప్రశ్నపత్రాన్ని అందజేసి తమకు నిండా ముంచారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్టియర్ బీకాం విద్యార్థులు సుమారు నాలుగు వేల మంది ఉండగా ఇందులో సగానికిపైగా విద్యార్థులు తారుమారు ప్రశ్నపత్రం కారణంగా నష్టపోయినట్లు తెలిసింది. తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. యూనివర్సిటీ అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయని పక్షంలో విద్యార్థి సంఘాలతో మమేకమై యూనివర్సిటీ వద్ద ధర్నాకు దిగుతామని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు కల్పించుకుని ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. మాదృష్టికి రాలేదు పేపర్లు మారిన విషయం ఇప్పటి వరకూ మా దృష్టికి రాలేదు. రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా పరీక్షా కేంద్రాలకు పంపిస్తాం. వీటి పంపిణీలో పొరపాటు జరిగితే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు మాదృష్టికి తీసుకురావాలి. లేదంటే అది వారి తప్పిదమవుతుంది. మా దృష్టికి వస్తేనే ఎలా న్యాయం చేయాలనేదానిపై ఆలోచన చేస్తాం. – తమ్మినేని కామరాజు, బీఆర్ ఏయూ పరీక్షల విభాగం డీన్ -
సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం!
► ఇంటర్ ప్రథమ సంవత్సర ఇంగ్లిష్ పేపర్ లీక్? ► ప్రభుత్వం ఎంపిక చేసింది సెట్–1 ► వాట్సాప్‌లో లీకైంది సెట్–3 ► ఈ ఏడాదికి సంబంధించిన పేపరే కాదన్న ఆర్ఐఓ కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం వైఫల్యమో లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోషల్ మీడియాలో (వాట్సాప్) ప్రశ్నాపత్రం లీక్ కావడం వంటి ఘటనలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసున్నాయి. ఇంత జరగుతున్నా అధికారులు ఇలాంటి సంఘటనలు అరికట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. తాజాగా శుక్రవారం కూడా కడప నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలకు చెందిన విద్యార్థుల మొబైల్ నుంచి ప్రశ్నపత్రం లీకైంది. సంబంధిత విషయం సోషియల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష ప్రారంభమైన మొదటి రోజే రాయచోటి సెంటర్ నుంచి వాట్సప్‌లో కొశ్చన్ పేపర్ లీకైంది. ఇది జరిగిన రెండు రోజులకే మళ్లీ కడపలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్–1కు సంబంధించి సెటర్–3 ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీకైందని వందంతులు కదం తొక్కాయి. ప్రభుత్వం మాత్రం ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి శుక్రవారం సెట్–1 ఎంపిక చేసినప్పటికి వాట్సాప్‌లో మాత్రం సెట్–3 లీక్ కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది ప్రశ్నపత్రామే కాదు వాట్సాప్‌లో శుక్రవారం వచ్చిన ప్రశ్నపత్రం ఈ ఏడాదికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇంటర్‌కు శుక్రవారం జరిగిన మొదటి సంవత్సర ఇంగ్లిష్ పేపర్‌ను రాష్ట్ర అధికారులు సెట్–1ను ఎంపిక చేశారు. కానీ వాట్సాప్‌లో వచ్చింది సెట్–3 . ఇది కేవలం ఆకతాయిలు చేసిన పని తప్ప మరొకటి కాదు. సెట్–3కి సంబంధించిన ప్రశ్నాపత్రం పోలీస్స్టేషన్లలో భద్రంగా ఉంది. కనుక ఆ పేపర్ లీక్ ఆయ్యే దానికి చాన్సే లేదు, వాట్సాప్‌లో వచ్చిన పేపర్ గతేడాదికి సంబంధించిన పేపర్ తప్ప మరొకటి కాదు. ఇదంతా విద్యార్థులను తప్పుదారి పట్టించేందుకు ఆకతాయిలు చేసిన పని. ఇలాంటి వదంతులను విద్యార్థులు ఎవరూ నమ్మాల్సిన పనిలేదు. – రవి, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి.