పీజీ ఎంట్రెన్స్ స్కాం నిందితులకు రిమాండ్ | NTR university Medical PG entrance test scam,Accused remanded to judicial custody | Sakshi
Sakshi News home page

పీజీ ఎంట్రెన్స్ స్కాం నిందితులకు రిమాండ్

Published Tue, Apr 8 2014 2:24 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

పీజీ ఎంట్రెన్స్ స్కాం నిందితులకు రిమాండ్ - Sakshi

పీజీ ఎంట్రెన్స్ స్కాం నిందితులకు రిమాండ్

విజయవాడ : విజయవాడలోని ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ ఎంట్రన్స్ కుంభకోణంలో మరో పదకొండు మంది నిందితులను సీఐడీ అధికారులు మంగళవారం మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయకుమార్ ఎదుట హాజరుపరిచారు.  అనంతరం వారిని ఈ నెల 21వరకు రిమాండ్‌కు తరలించారు.

వారిలో 7వ ర్యాంకర్‌ పాముబయటి భరత్ కుమార్, 14వ ర్యాంకర్‌ చిగురుపాటి రామరావు, 15వ ర్యాంకర్‌ చిలకల సాయి ప్రణీత్‌, 26 వ ర్యాంకర్‌ కోవెలకారు రమణ ఉన్నారు. ఈ కుంభకోణంలో యూనివర్శిటి సిబ్బందిపై సైతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పరీక్ష రద్దు అయ్యేదాకా వెళ్లింది. మొత్తంమీద ఈ కుంభకోణానికి సంబంధించి 20 మంది నిందితులను  సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement