కామన్‌ పేపర్‌.. ఎక్కువ చాయిస్‌లు | Higher Education Council Has Begun To Work On Question Papers In Telangana | Sakshi
Sakshi News home page

కామన్‌ పేపర్‌.. ఎక్కువ చాయిస్‌లు

Published Sun, May 3 2020 1:07 AM | Last Updated on Sun, May 3 2020 10:44 AM

Higher Education Council Has Begun To Work On Question Papers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు కామన్‌ పేపర్‌తో ఎక్కువ చాయిస్‌ ఉండేలా ప్రశ్నలతో పరీక్ష ప్రశ్న పత్రాలు రూపొందించే అంశాల పై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇటీవల పరీక్షలు, విద్యా కార్యక్రమాలపై జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి పలు యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యూజీసీ మార్గదర్శకాల జారీ కంటే ముందుగానే డిటెన్షన్‌ విధానాన్ని ఎత్తివేసి, మార్కులతో సంబంధం లేకుండా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకు యూనివర్సిటీలు కూడా సిద్ధం కావాలని పేర్కొంది. యూనివర్సిటీ స్థాయిలోనూ పరీక్షల విభాగం నియంత్రణాధికారులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలతో చర్చించి నివేదికలు సిద్ధం చేసుకోవాలని పాపిరెడ్డి ఆదేశించారు. నాలుగు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని, అందులో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో తాము తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించాలని నిర్ణయించారు. చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు 

త్వరలోనే నిర్ణయం..
వీలైతే జూన్‌ 20 నుంచి లేకపోతే జూలై 1 నుంచి ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. మిగతా సెమిస్టర్‌ల వారికి జూలై 15 నుంచి నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే వారికి పరీక్షలు నిర్వహించాలా.. యూజీసీ చెప్పినట్లు కిందటి సెమిస్టర్‌ మార్కుల ఆధారంగా మార్కులు ఇవ్వాలా.. అన్న దానిపై త్వరలో నిర్వహించే సమావేశంలో  నిర్ణ యం తీసుకోనున్నారు. పరీక్ష సమయాన్ని 3 గంటలు నుంచి 2 గంటలకు కుది ంచాలనే యోచనలో ఉంది.

కామన్‌ పేపరు విధానం అవలంబించాలని, ఎక్కువ ఆప్షన్లు ఉండేలా ప్రశ్నల సరళి ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మొత్తంగా 10 నుంచి 14 వరకు ప్రశ్నలు ఇచ్చి అందులో సగం (5 నుంచి 7 ప్రశ్నలకు) ప్రశ్నలకు జవాబు రాయాలనే విధానం అమలుపై యోచిస్తున్నారు. వీలైతే ఆబ్జెక్టివ్‌లోనూ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ చెప్పినా, రాష్ట్రంలో విద్యార్థులకు డిస్క్రిప్టివ్‌ విధానం అలవాటు ఉండటంతో ఇబ్బంది పడతారనే ఆలోచనతో దాని అమలు అవసరం లేదన్న భావనకు వచ్చారు.  
చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement