ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో కన్నడ మూవీ ‘కాంతర’ సృష్టించిన సన్సేషన్ అంతా ఇంత కాదు. కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేజీఎఫ్‌ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్‌కి ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో రిషబ్ ట్రాన్స్‌ఫార్మేషన్ అందరికి గూస్‌బంప్స్ తెప్పించింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ హవా కొనసాగింది. కన్నడ నుంచి బాలీవుడ్ వరకు కాంతార విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. తాజాగా కాంతార మ్యానియా విద్యారంగంలోనూ వ్యాపించింది. ఈ చిత్రం కర్ణాటక గ్రామ ప్రాంతాల్లో నిర్వహించే భూతకోల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
దీంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపరల్లో కాంతార మూవీపై ప్రశ్న అడిగారు. ఇందుకు క్వశ్చన్ పేపర్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కింది’ అంటూ జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హీరోయిన్ సప్తమి గౌడ్ ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
చదవండి:
సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం
ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’
Comments
Please login to add a commentAdd a comment