
తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ రష్మిక మందన్నా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నెట్టింట తనపై వస్తున్న నెగిటివిటీపై ఆమె స్పందిస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. వివరణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని, నటిగా ఎదగడానికి అవి తనకు ఉపయోగమంటూ తన పోస్ట్‌లో పేర్కొంది. అయితే విమర్శలను ఎదుర్కొవడం ఆమెకు ఇదేం తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు రష్మిక ట్రోల్స్ బారిన పడింది. అంతేకాదు విజయ్‌తో డేటింగ్ అంటూ పుకార్లు వచ్చాయి.
చదవండి: పరిస్థితి మరింత దిగజారింది: రష్మిక ఎమోషనల్ పోస్ట్
అయినా వాటన్నింటికి ఎప్పుడూ స్పందించని ఆమె ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యింది. ట్రోలర్స్‌కు తనదైన మాటలతో కౌంటరిచ్చింది. దీంతో అసలేం జరిగింది.. రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణమేంటన్నది చర్చనీయాంశమైంది. దీంతో ఆరా తీయగ అసలు విషయం బయటికొచ్చింది. కాగా ఈ మధ్యకాలంంలో రష్మిక ఎక్కువగా ముంబైలో ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విలేకరుల కంటపడింది. ఈ సందర్భంగా కాంతార సినిమా చూశారా? అని రిపోర్టర్లు ఆమెను ప్రశ్నించారు.
చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ?
దీంతో ఇంకా చూడలేదని, త్వరలోనే చూస్తానని సమాధానం ఇచ్చిందామె. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఇది చూసిన కన్నడ ప్రేక్షకులు ఆమెపై విమర్శల దాడికి దిగారు. కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన రష్మిక.. ఇప్పుడు మూలాలను మర్చిపోయిందని.. ప్రపంచమే మెచ్చిన కాంతార సినిమాను ఆమె ఇంకా చూడకపోవడం ఏంటీ ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రష్మికపై నెట్టింట దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న నెగిటవ్ కామెంట్స్పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రష్మిక సినీరంగ ప్రవేశం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment