
నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సౌందర్య. ఈ కన్నడ నటి 1992లో విడుదలైన పా నానా ప్రిదీసు అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 1993లో పొన్మణి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ రజనీకాంత్, విజయ్‌కాంత్, పార్తీపన్ వంటి స్టార్ హీరోలతో నటించారు. రజనీకాంత్ సరసన నటించిన పడయప్పా, అరుణాచలం చిత్రాలు సూపర్‌హిట్ అయ్యి సౌందర్యను స్టార్ హీరోయిన్‌ను చేశాయి.
అదే విధంగా తెలుగు,మలయాళం భాషల్లోనూ నటించి బహుభాషా నటిగా రాణించారు. తెలుగులో చిరంజీవి,వెంకటేష్,నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించి ఆమె చెరగని ముద్ర వేసింది అలా ప్రముఖ కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ఆమె 2004లో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి హెలీకాప్టర్‌లో వెళ్తూ దుర్మరణం చెందారు.
కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్న నటి రష్మిక మందన్నా కూడా కన్నడ భామే అన్నది తెలిసిందే. ఈమె కూడా మాతృభాషలో కథానాయకిగా పరిచయం అయ్యి ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీలో కథానాయకిగా నటిస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ఓ భేటీలో పేర్కొంటూ తనకు నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఆశగా ఉందన్నారు. తనను చిన్నతనంలో సౌందర్యలా ఉన్నావని తన తండ్రి అనే వారని, ఆ విషయాన్ని తలచుకుంటే గర్వంగా ఉంటుందన్నారు. అవకాశం వస్తే కచ్చితంగా సౌందర్య బయోపిక్‌లో నటిస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment