వాట్సప్ లో పదో తరగతి ప్రశ్నపత్రం చక్కర్లు కొడుతుందనే సమాచారంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వాహణను కట్టుదిట్టం చేశారు.
వాట్సప్ లో పదో తరగతి ప్రశ్నపత్రం చక్కర్లు కొడుతుందనే సమాచారంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వాహణను కట్టుదిట్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో గురువారం పదో తరగతి హిందీ పరీక్ష జరుగుతుండగా.. పరీక్ష ప్రారంభమైన అర్ధ గంటలోనే ప్రశ్నపత్రం లీక్ అయిందని.. వాట్సప్‌లో చక్కర్లు కొడుతుందని వదంతులు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన విద్యాధికారులు పరీక్ష కేంద్రాల్లో భద్రతను పెంచడంతో.. పాటు నిర్వాహణను కట్టుదిట్టం చేశారు. అనంతరం జిల్లా విద్యాధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు.