Hindi exam
-
ఒక విద్యార్థి.. 8 మంది సిబ్బంది
ఓ పరీక్ష కేంద్రంలో పదో తరగతి హిందీ పరీక్ష కోసం.. చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది ప్రైవేట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఈ పరీక్ష కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు హిందీ పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. టి.రమేశ్ అనే ఒకే విద్యార్థి హాజరయ్యాడు. పరీక్ష నిర్వహణ కోసం 8 మంది సిబ్బంది విధులు నిర్వహించారు. ఇందులో ఛీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, రిలీవర్, క్లర్క్, అంటెండర్, వాటర్‌మన్, పోలీసులు విధులు నిర్వహించడం విశేషం. -
ఒకే ఒక్కరు
గండేడ్ : పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు సెంటర్లో గురువారం జరిగిన హిందీ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యారు. గండేడ్ మండలం మహమ్మదాబాద్ కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం 150 మంది విద్యార్థులకు సెంటర్‌ను ఏర్పాటు చేశారు. హిందీ పరీక్ష మాత్రం ఒకే విద్యార్థి రాయాల్సి ఉంది. ఆమె కోసమే ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ ఒకరు, ఇద్దరు ఇన్విజిలేటర్లు, బందోబస్తు కింద ఇద్దరు పోలీసులు, ఒక వాటర్‌బాయ్ విధులు నిర్వర్తించారు. -
వాట్సప్‌లో లీకైన పదోతరగతి ప్రశ్నపత్రం!
వాట్సప్ లో పదో తరగతి ప్రశ్నపత్రం చక్కర్లు కొడుతుందనే సమాచారంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వాహణను కట్టుదిట్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో గురువారం పదో తరగతి హిందీ పరీక్ష జరుగుతుండగా.. పరీక్ష ప్రారంభమైన అర్ధ గంటలోనే ప్రశ్నపత్రం లీక్ అయిందని.. వాట్సప్‌లో చక్కర్లు కొడుతుందని వదంతులు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన విద్యాధికారులు పరీక్ష కేంద్రాల్లో భద్రతను పెంచడంతో.. పాటు నిర్వాహణను కట్టుదిట్టం చేశారు. అనంతరం జిల్లా విద్యాధికారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు.