
ఒక విద్యార్థి.. 8 మంది సిబ్బంది
ఓ పరీక్ష కేంద్రంలో పదో తరగతి హిందీ పరీక్ష కోసం..
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది ప్రైవేట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఈ పరీక్ష కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు హిందీ పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. టి.రమేశ్ అనే ఒకే విద్యార్థి హాజరయ్యాడు.
పరీక్ష నిర్వహణ కోసం 8 మంది సిబ్బంది విధులు నిర్వహించారు. ఇందులో ఛీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, రిలీవర్, క్లర్క్, అంటెండర్, వాటర్‌మన్, పోలీసులు విధులు నిర్వహించడం విశేషం.