
సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ సెంట్రల్ జోన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజి విజేతగా నిలిచింది. సీఎంఆర్ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సెయింట్ మార్టిన్స్ 1–0తో ఆతిథ్య సీఎంఆర్ జట్టుపైనే విజయం సాధించింది.
మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను కైలాష్‌శర్మ సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో సెయింట్ మార్టిన్స్ 4–1తో బీవీఆర్‌ఐటీపై గెలుపొందింది. విజేత జట్టు చేసిన నాలుగు గోల్స్‌నూ కెప్టెన్ శరత్‌చంద్ర సాధించడం విశేషం. మరో సెమీస్‌లో సీఎంఆర్ 1–0తో వీఎన్‌ఆర్ వీజేఐఈటీపై గెలుపొంది ఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment